హైదరాబాద్

ఉద్యమస్ఫూర్తిగా చెత్తకు విడాకుల దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 14: స్వచ్ఛ్భారత్ సాధన కోసం గురువారం నుంచి నగరంలో కేంద్ర స్వచ్ఛ్భారత్ మిషన్ నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ 2018ను పురస్కరించుకుని బుధవారం నగరంలో చెత్తకు విడాకుల దినోత్సవం ఉద్యమ స్ఫూర్తితో జరిగింది. బుధవారం ప్రపంచ ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే తరహాలో రకరకాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కొన్ని సర్కిళ్లలో ర్యాలీలు, మరికొన్ని చోట్ల ఊరేగింపులు నిర్వహించగా, పలు రద్దీ కూడళ్లలో చెత్తను తడి, పొడిగా వేరు చేయటంపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లు, ఐదు జోన్లలో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో అవగాహన పెంపొదించేందుకు రకరకాలుగా నిర్వహించారు. ఇంట్లోనే చెత్తను వేరు చేసేందుకు ఇప్పటికే పంపిణీ చేసిన ట్విన్ బిన్లను కొన్ని చోట్ల పూజించి, అధికారులు ఊరేగింపులను నిర్వహించగా, మరికొన్ని చోట్ల బిన్లను డప్పులు, బ్యాండు మేళంతో ఊరేగించారు. మరికొన్ని చోట్ల మానవహారాలు నిర్వహించారు. చెత్త కలిసి ఉండటం ద్వారా కలిగే దుష్పరిమాణాలు, చెత్తను, తడి, పొడిగా విడదీయటంతో కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. ఇంట్లోనే ఈ చెత్తను వేరు చేసి, ఎరువుల తయారీకి ఉపయోగించవచ్చునని, ప్రతి ఇంట్లో కంపోస్టు యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవాలని అధికారులు ప్రజలకు సూచించారు. రకరకాలుగా చెత్తలో 75 శాతాన్ని ప్రత్యామ్నాయంగా వినియోగించుకునే అవకాశముందన్న విషయాన్ని మహానగరవాసులు గుర్తించి, ఇంట్లోనే తడి, పొడిగా వేరు చేసి, స్వచ్ఛ ఆటో టిప్పర్ల డ్రైవర్లకు అందించాలని అధికారులు ప్రత్యేకంగా సూచించారు.