జాతీయ వార్తలు

బాహుబలికి మహామస్తకాభిషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి పనె్నండు సంవత్సరాలకు ఒకసారి జరిగే గోమఠేశ్వర బాహుబలి మహామస్తకాభిషేకం ఆదివారం కర్నాటకలోని శ్రావణబిళగొళలో ప్రారంభమైంది. బాహుబలి విగ్రహానికి ఈ మహామస్తకాభిషేకం జరిగింది.
2006లో ఈ అభిషేకం నిర్వహించారు. ఏకశిలపై చెక్కిన 57 అడుగుల బాహుబలి విగ్రహానికి ఇది
88వ మహా మస్తకాభిషేకం. ఒక్క శిలపై ఇంత భారీ విగ్రహం చెక్కడం ప్రపంచంలోనే మొట్టమొదటిది.
మహామస్తకాభిషేకంలో భాగంగా ఈ కేంద్రానికి చేరుకున్న భక్తులపై పవిత్ర జలాలను జల్లుతారు.
ఈ విగ్రహంపై నీళ్లు జల్లి పునీతం చేసి కొబ్బరికాయలు, పాలు, చెరుకురసం, కుంకుమపువ్వు,
గంధం, పసుపులతో అభిషేకిస్తారు. ఈ నెల 25 వరకు అభిషేక ఉత్సవం కొనసాగుతుంది.