జాతీయ వార్తలు

ఫలితాల సాధనే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 18:కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేపట్టిన బడ్జెట్ సంస్కరణల వల్ల కొత్త పని సంస్కృతి ఆవిష్కృతమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దీనివల్ల దేశంలో సామాజిక-ఆర్థిక పరివర్తన సాధ్యమైందని పేర్కొన్నారు. దేశంలోని అన్ని రంగాల సమగ్రాభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని ఉద్ఘాటించిన మోదీ ‘మాకు ఫలితాలే ముఖ్యం. వాటిని సాధించేందుకు నిధుల లేమి ఏ మాత్రం అవరోధం కాదు. బడ్జెట్ అన్నది కేవలం కేటాయింపులకే పరిమితం కాదు’అని తెలిపారు. అన్ని విధాలుగా అవరోధాలు, అసంతృప్తి నెలకొన్న వాతావరణంలో తమ ప్రభుత్వం పనిచేస్తోందని మహారాష్టల్రో ఆదివారం జరిగిన గ్లోబల్ ఇనె్వస్టర్ శిఖరాగ్ర సదస్సులో తెలిపారు. బడ్జెట్ రూపకల్పనలోనూ, ఫలితాలను సాధించే లక్ష్యంతో నిధులను కేటాయించడంలోనూ సరికొత్త విధానాలను తెరపైకి తెచ్చామని మోదీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా కేంద్రం వ్యవహరిస్తోందని, సామర్థ్య ప్రాతిపదికగా పాలన సాగుతోందని తెలిపారు. అలాగే ప్రభుత్వం బాధ్యతాయుతంగా పనిచేస్తోందని, ప్రజాస్వామ్య స్ఫూర్తితో వ్యవహరిస్తోందని తెలిపారు. గత మూడున్నర సంవత్సరాలుగా తమ ప్రభుత్వం అమలు చేసిన ఆర్థిక సంస్కరణలు, గుణాత్మక విధానాల వల్ల ఆర్థికంగా బలపడ్డామని, ఐదు ట్రిలియన్ డాలర్ల స్థూల జాతీయోత్పత్తి దిశగా పరుగులు తీస్తున్నామని మోదీ తెలిపారు. దేశంలోనే తొలి ట్రిలియన్ డాలర్ల మహారాష్ట్ర అవిర్భవించగలదన్న నమ్మకాన్ని ప్రధాని మోదీ ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. మహారాష్ట్ర పరిణామాలు దేశంలో వస్తున్న మార్పులకు సంకేతాలని అన్నారు. సమగ్రమైన దృక్పథం, సమీకృత ఆలోచనలతో ప్రభుత్వాలు ముందుకెళ్లినప్పుడే ఏ దేశమైనా అభివృద్ధి సాధిస్తుందని మోదీ అన్నారు.సామర్థ్యం, విధానం, ప్రణాళిక, ఫలితాలను ఏ మేరకు సాధించారన్నదానిపైనే దేశాభివృద్ధి ఆధారపడి ఉంటుందని అన్నారు. ఆదే సమగ్ర ప్రగతికి సోపానం అవుతుందని పునరుద్ఘాటించారు. గత మూడున్న సంవత్సరాల్లో తమ ప్రభుత్వం 1400 కాలం చెల్లిన చట్టాలను రద్దు చేసిందని, సరళీకృత రీతిలో కొత్త చట్టాల రూపకల్పన జరుగుతోందని తెలిపారు. పెట్టుబడుల విషయంలోనూ రాష్ట్రాల మధ్య ఆరోగ్యకర పోటీ సాగుతోందని, వాటివాటి సామర్థ్యాన్ని బట్టి రాష్ట్రాలు పెట్టుబడుల్ని ఆకర్షించగలుగుతున్నాయని మోదీ తెలిపారు. పెద్ద పంచాయతీల్లో లక్షన్నర వెల్‌నెస్ కేంద్రాల్ని ఏర్పాటు చేస్తామని, ముద్ర పథకం పరిధిలోకి 10.5కోట్ల మందిని తీసుకొచ్చామని ప్రధాని వెల్లడించారు.
chitram...
ఆదివారం ముంబయ గ్లోబల్ ఇనె్వస్టర్ శిఖరాగ్ర సదస్సులో వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్