క్రీడాభూమి

యువతకు అశ్విన్ రోల్ మోడల్: కిర్మాణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 18: భారత క్రికెట్ క్రీడా ప్రపంచంలో అంకితభావంతో పనిచేస్తూ ఘనవిజయాలను నమోదు చేస్తున్న ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ యువతకు రోల్ మోడల్ అని మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణీ పేర్కొన్నాడు. చెన్నైలో అశ్విన్‌కు ‘ఐకాన్ ఆఫ్ చెన్నై’ అవార్డు ప్రదానం చేసిన సందర్భంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో కిర్మాణీ పాల్గొన్నాడు. రవిచంద్రన్ అశ్విన్ ఇంతవరకు సాధించిన ఘనత గురించి తాను ఎంత చెప్పినా తక్కువే అవుతుందని, అతని గురించి వర్ణించాలనంటే తనకు మాటలు రావడం లేదని వ్యాఖ్యానించాడు. ఈ సందర్భంగా సభా వేదికపై అశ్విన్‌ను ఆయన అభినందనలు అందజేశాడు. అశ్విన్ కేవలం తన స్వంత రాష్ట్రం తమిళనాడుకే కాకుండా యావత్ దేశంలోని యువతకు ఖచ్చితంగా రోల్ మోడల్ అని ఆయన అన్నాడు.
పీసీబీ బ్రాండ్ అంబాసిడర్‌గా అఖ్తర్
ఇస్లామాబాద్, ఫిబ్రవరి 18: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని పీసీబీ చైర్మన్ ఇక్కడ ప్రకటించాడు. క్రికెట్ వ్యవహారాల సలహాదారుగా, పీసీబీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం వల్ల చైర్మన్ నజామ్ సేథీతో అతను కలసి పనిచేయనున్నాడు. తన నియామకం పట్ల అఖ్తర్ స్పందిస్తూ పాక్ ఈ అవకాశం లభించడం గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నాడు. ఒక ఆటగాడిగా పాక్ జట్టుకు తాను ఏరకంగా సేవలు అందించానో అదే తరహాలో పీసీబీ బ్రాండ్ అంబాసిడర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంటానని అన్నాడు.