Others

ఆమె నవ్వింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రా: మిమ్మల్ని చూస్తూంటే, ఎలా బతకడమో క్రమంగా తెలుస్తోంది. వైదేహిగారూ! మీరు నాకొక్క సహాయం చేసిపెడతారా?
వై: మిమ్మల్ని తిరిగి మనిషి చెయ్యడం. అంతేనా? (నవ్వుతుంది)
రా: మీకు నవ్వొస్తోందా?
వై: క్షమించండి ఊరికే నవ్వాను. మీరు చెప్పింది నాకర్థం అయింది. తప్పకుండా, చూడండి- దేవుడనండి, ప్రకృతి అనండి.. ఎవరైతేనేం- మనకి ఒక్కటే జీవితం ప్రసాదించారు. దానికి తిరుగులేదు. ఒక్కటే ఒక ఛాన్సు. వేసిన అడుగు మళ్లీ వెనక్కి తీసుకోలేం.
రా: ఎంత భయంకరం!
వై: అవునా! అయినప్పుడు ఆ ఒక్క అవకాశాన్నీ ఎందుకు సద్వినియోగం చేసుకోకూడదు? వృధాగా పాడు ఇంట్లో దీపంలాగా బతికేకంటే.
రా: అంతే నేనడిగేదీనూ నాకు చాలా కలలున్నాయి. అవి చివరికి ఏమవుతాయో చెప్పలేను. అయినా ప్రయత్నిస్తాను. ఆ ప్రయత్నంలో మీ ప్రోత్సాహం..
వై: తప్పకుండా, నావల్ల ఇంకొక మనిషి జీవితానికి సార్థకత కలిగితే అంతకన్నా కావలసిందేముంది? దానివల్ల నా జీవితమూ కొంత సార్థకం అవుతుంది అదిగో సినిమా హాలు దగ్గరికి వచ్చేశాం పదండి..
***
తండ్రి: అమ్మాయ్ వైదేహి...
వై: ఏం నాన్నా!
తండ్రి: రెండు మూడు రోజులనుంచీ నీకో విషయం చెపుదామనుకుంటున్నాను.
వై: ఏమిటది?
తండ్రి: ఆఁ మరేం లేదు ఆ రామారావుని వెంటేసుకుని అలా బీచి షికార్లకనీ, సినిమాలకనీ వెళుతున్నావు గదా! కాస్త ముందు వెనుకలు ఆలోచించావా?
వై: ఆలోచించాను నాన్నా. అందులో ఏమీ తప్పు లేదు. నేనాయన్ని బాగా అర్థం చేసుకున్నాను. ఆయనది నిష్కల్మషమైన హృదయం. కోట్లలో ఎన్నదగిన మనిషి.
తండ్రి: పోనీ అలాగే అనుకుందాం. కాని, వచ్చే నెలలో మీ ఆయన టూరునుంచి తిరిగి వచ్చేస్తున్నాడు. ఇదంతా చూసి అతగాడు ఏవనుకుంటాడు?
వై: ఏమనుకుంటారు? ఏమీ అనుకోరు మాకు ఒకరిమీద ఒకరి ఆ మాత్రం నమ్మకాలు ఉన్నాయి. మాది చాలా సుఖమైన దాంపత్య జీవితం నాన్నా!
తండ్రి: సరే- నీ యిష్టం. అంతకంటే ఏం చెప్పను? నీకామాత్రం ఆత్మవిశ్వాసం ఉంటే మంచిదే.
వై: నాకూ, మావారికీ ఉన్నదే ఆత్మవిశ్వాసం. ఇంతకూ ఇంతమంది చూసి మూర్ఛపోయేందుకు యిందులో ఏముంది నాన్నా? పాపం ఆ రామారావుని చూస్తే నీకు జాలిలేదూ? అడుగడుగునా అతణ్ణి జీవితం మోసం చేసింది. ఆత్మీయులు మోసం చేశారు దానితో అన్ని విధాలా కుంగిపోయి బెంబేలు పడిపోయాడు. అతనికిప్పుడు కావలసింది కాస్త ధైర్యం చెప్పడం, చిరునవ్వుతో కొంచెం చేయూత ఇవ్వడం! బతుకంటే భయం పోగొట్టడం. ఆ పని మొరటుగుండెల మొగవాడు చెయ్యలేడు నాన్నా! చల్లని స్ర్తి హృదయమే ఆ పని చెయ్యగలదు.
తండ్రి: నువ్వు అంతటి ఫలప్రదమైన జీవితం గడపదలచుకుంటే నేను మాత్రం సంతోషించనా వైదేహీ!!
***
రా: వైదేహిగారూ! ఇవాళ మధ్యాహ్నమే నా భార్య మళ్లీ నా యింట్లో అడుగుపెట్టింది ఆమెలో కొంత పశ్చాత్తాపం కనబడుతూంది. క్రమంగా నన్ను మీరు మనిషిని చేస్తున్నారు. ఇంకా నన్ను చూస్తూంటే మీకు నవ్వొస్తోందా? మీరు నవ్వినకొద్దీ నాకు ధైర్యం ఎక్కువౌతోంది!
వైదేహి: మంచిది చూడండీ! సమస్త పాపాల్లోకీ భయంకరమైన పాపం భయపడ్డం. ఆ తరువాత, హృదయంలో దయా, ప్రేమా, యివి ఉన్నందుకు సిగ్గుపడకండి. కాని ఏ ఘట్టంలో అయినా అల్పహృదయం ఎదురై వేధిస్తే ధైర్యంగా ఆ అల్పహృదయాన్ని నలిపి అవతల పారెయ్యండి. బతకవలసినన్నాళ్ళూ నిబ్బరంగా, విశ్వాసంతో బతకండి. మీ మూలాన ప్రపంచానికి ఇంకొంచెం దుఃఖం, ఇంకొంచెం వేదన ఇవ్వకుండా, చుట్టుప్రక్కల కొంచెం ఆనందం వెదజల్లండి. అంతే. చీకటిని తిట్టుకుంటూ కూర్చునేకంటే, ఈ చీకటిలో ఒక్క చిన్న దీపకళిక వెలిగించండి!
రా: మీ నవ్వు నా జీవితంలో వెయ్యి దీపాలు వెలిగించింది వైదేహిగారూ! వాటి కాంతి వృధాపోనివ్వను!

-అయపోయంది

(ఆకాశవాణి సౌజన్యంతో...)