ఉత్తరాయణం

రైతు సమితులతో స్థానిక సంస్థలు నిర్వీర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ ప్రభుత్వమైనా రైతు సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుంది. భారత దేశంలో ‘రైతే రాజు’ అన్న చందంగా ‘రైతే దేశానికి వెనె్నముక’ అన్న నానుడిని నిజం చేయాలంటే ‘రైతుల’కు న్యాయం చేకూర్చాల్సిన అవసరం ఉన్నది. అయితే రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనార్థం పేరిట ఏర్పాటు చేస్తున్న రైతు సమన్వయ కమిటీలు అధికార పక్షానికి అనుబంధ విభాగాలుగా భావించబడుతున్నాయని, తద్వారా రాజకీయ పునరావాసం కల్పించబడుతున్నదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాజకీయాలకు అతీతంగా ఉత్పత్తి వ్యయం తగ్గించడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఎకరాకు ఎనిమిది వేల సాయం హర్షణీయమే అయినా, దాని అమలుకై రైతు సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయడం ఆక్షేపణీయమని ప్రతిపక్షాలు అంటున్నాయి. గతంలో 1988లో ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి పదవి కల్పించడానికి నిర్దేశితమైన కర్షక పరిషత్ ఏర్పాటును హైకోర్టు తిరస్కరించిందని, టిడిపిలో ఆనాడు ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కీలకపాత్ర పోషించారని ఆ అనుభవం ఇప్పటి ప్రభుత్వానికి గుర్తుకు రావటం లేదా అని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. అధికార పార్టీ తప్ప అన్ని పార్టీలు 39 జీవో రద్దును డిమాండ్ చేస్తున్నాయని ప్రతిపక్షం ప్రశ్నిస్తోంది. అలాగే అధికార పార్టీకి అనుబంధ సంస్థలో భాగంగా భావిస్తూ పార్టీ కార్యాలయాలలో తయారైన జాబితాల బాధ్యులకు అధికారులు ప్రభుత్వ పక్షాన శిక్షణలు నిర్వహించడం సమంజసం కాదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. రాగద్వేషాలకు అతీతంగా, రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటామని ముఖ్యమంత్రి నుండి సర్పంచ్ వరకు, చీఫ్ సెక్రటరీ నుండి కలెక్టర్ వరకు అధికారులు ప్రతిజ్ఞ చేసి ఇలాంటి సమితులను ఏర్పాటు చేయడం భావ్యం కాదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 39 జీవో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని, దీనివల్ల భవిష్యత్తులో స్థానిక సంస్థల ఉనికి ప్రశ్నార్థకంగా ఉంటుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. రైతు సమన్వయ కమిటీల వల్ల గ్రామాలలో కేవలం అధికార పార్టీకి చెందిన వాళ్లకే దక్కుతున్నాయని, పేద మధ్య తరగతి రైతులకు తీరని నష్టం జరుగుతుందని ప్రతిపక్షం ప్రశ్నిస్తోంది. గతంలో ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు అధికారాలు కల్పిస్తూ తెచ్చిన రాజ్యాంగంలోని 73, 74 సవరణలకు తూట్లు పొడుస్తూ రాష్ట్రప్రభుత్వం గత ఆగస్టు 27న జీవో నం.39 జారీ చేసిందని, దీనివల్ల గ్రామాల్లో భూతగాదాలు, పాతకక్షలు చెలరేగే అవకాశాలు ఉన్నాయని కొంది వాదన. సమితుల వల్ల వ్యవసాయ, రెవెన్యూ రంగాలపై కూడా వీటి పెత్తనం కొనసాగి స్థానిక సంస్థల ఉనికికి ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. రైతు సమన్వయ సమితుల్లో అధికార పక్షం కార్యకర్తలు ఉంటూనే అసలైన రైతులు నష్టపోతున్నారని రైతులు కానివారిని కూడా సభ్యులుగా చేర్చి తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని రైతు సంఘాలు అంటున్నాయి. రాజ్యాంగ విరుద్ధంగా స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసే 39 జీవో జారీని వెంటనే ఉపసంహరించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. ఏది ఏమైనా రాజకీయ కార్యకర్తలు ఎన్ని పదవులు తీసుకున్నా రైతులకు నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ఆశిద్దాం.

- గుండు రమణయ్య పెద్దాపూర్ - జూలపల్లి