జాతీయ వార్తలు

సింగపూర్ ప్రధానితో రాహుల్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్, మార్చి 9: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, శుక్రవారం సింగపూర్ ప్రధాని లీ సైన్ లూంగ్‌ను, ఇతర సీనియర్ నాయకులను కలుసుకున్నారు. రాహుల్ గాంధీ సింగపూర్, మలేసియాల్లో మూడు రోజుల పర్యటన జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మలేసియా ప్రధాని నజీబ్ రజాక్‌ను కూడా కలుసుకుంటారు. ఇదే సమయంలో ఆయన ఆయాదేశాల్లోని భారత్‌కు చెందిన వాణిజ్య వర్గాలతో సమావేశమవుతారు. సింగపూర్ ప్రధానిని కలుసుకున్న సమయంలో రాహుల్ వెంట కాంగ్రెస్ నేత మిలింద్ దియోరా, టెలికాం ఎంటర్‌ప్రెన్యూర్ శ్యాం పిట్రోడా కూడా ఉన్నారు. ‘‘సింగపూర్ ప్రధానిని కలుసుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చింది’’ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. సింగపూర్ డిప్యూటీ ప్రధాని థర్మన్ షన్ముగరత్నంను కూడా కలిసారు. గురువారం నుంచి రాహుల్ సింగపూర్ పర్యటన ప్రారంభమైంది. ప్రతిష్ఠాత్మక లీ కువాన్ యూ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీలో ఆయన లాంఛనంగా ప్రసంగించారు. అంతకుముందు ఐఎన్ మెమోరియల్‌ను సందర్శించి సుభాష్ చంద్రబోస్‌కు ఘనంగా నివాళులర్పించారు.
chitram...

సింగపూర్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ శుక్రవారం
ఆ దేశ ఉప ప్రధాని తర్మాన్ షణ్ముగరత్నంను కలుసుకున్నప్పటి చిత్రం

మైనర్లపై అత్యాచారం చేస్తే ఇక ఉరిశిక్షే
రాజస్థాన్‌లో బిల్లు ఆమోదం
జైపూర్, మార్చి 9: పనె్నండేళ్ల లోపు బాలికలపై అత్యాచారం జరిపితే ఉరిశిక్ష విధించే బిల్లుకు శుక్రవారం రాజస్థాన్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మధ్య ప్రదేశ్ తర్వాత ఇటువంటి బిల్లును ఆమోదించిన రెండో రాష్ట్రం రాజస్థాన్. అయితే ఈ బిల్లు చట్టరూపం దాల్చాలంటే రాష్టప్రతి ఆమోదముద్ర అవసరం. అందుకనే బిల్లును రాష్టప్రతి వద్దకు పంపారు. గత ఏడాది డిసెంబర్‌లో మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ‘దండ విధి విధేయక్ (మధ్యప్రదేశ్ సంశోధన్)-2017 బిల్లును ఆమోదించింది.

లక్నోలో శుక్రవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్న సమాజ్‌వాది పార్టీ రాజ్యసభ అభ్యర్థి జయా బచన్

జడ్జీల రిటైర్మెంట్ వయస్సులో మార్పు లేదు
పెంచే యోచన లేదన్న కేంద్రం రాజ్యసభలో స్పష్టీకరణ
న్యూఢిల్లీ, మార్చి 9: హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు పెంచే ప్రతిపాదన ఏదీలేదని కేంద్రం స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తులు పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లుకాగా 65 ఏళ్లకు పెంచుతారన్న కథనాలు వెలువడ్డాయి. శుక్రవారం రాజ్యసభలో హైకోర్జు జడ్జిల రిటైర్‌మెంట్ వయస్సుపై వచ్చిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి పీపీ చౌదరి ఈమేరకు వివరణ ఇచ్చారు. హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును పెంచాలన్న ప్రతిపాదన ప్రభుత్వానికి లేదని ఆయన బదులిచ్చారు. యుపీఏ ప్రభుత్వం 2010లో హైకోర్టు జడ్జిల రిటైర్‌మెంట్ యవస్సును 65 ఏళ్లకు పెంచాలన్న బిల్లును ఒకదాన్ని తీసుకొచ్చింది. అయితే 2014 లోక్‌సభ ఎన్నికల్లో యుపీఓ ఓటమితో 114 సవరణ బిల్లుకు కాలదోషం పట్టింది. దేశ వ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో అప్పట్లో రిటైర్‌మెంట్ వయస్సు పెంచాలని ప్రభుత్వం యోచించింది. ప్రస్తుత గణాంకాల ప్రకారం 24 హైకోర్టుల్లో 406 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే దేశవ్యాప్తంగా మూడు కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి.