జాతీయ వార్తలు

కుట్ర లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 9: ప్రముఖ నటి శ్రీదేవి (54) మృతికి సంబంధించి దాచిపెట్టడానికి ఏమీలేదని శుక్రవారం విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ‘నాకు తెలిసినంతవరకు, యుఏఈ ప్రభుత్వం అవసరమైన పేపర్ వర్క్ పూర్తి చేసి మాకు అందజేసింది. వాటి ఆధారంగా శ్రీదేవి పార్థివ దేహాన్ని భారత్‌కు తీసుకొచ్చాం. ఇందులో అనుమానించడానికి ఏముంది? ఒకవేళ అటువంటిదేమైనా ఉంటే ఇప్పటికే బయటపడేది కదా’ అని విదేశాంగశాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ పేర్కొన్నారు. 2018, ఫిబ్రవరి 24న శ్రీదేవీ దుబాయ్‌లో మృతి చెందారు. ప్రమాద వశాత్తు బాత్‌టబ్‌లో మునిగి చనిపోయారంటూ దుబాయ్ అధికార్లు ధ్రువీకరించిన తర్వాత, ఆమె పార్థివదేహాన్ని 27వ తేదీన భారత్‌కు తీసుకొచ్చారు. ఫిబ్రవరి 28న అధికార లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు జరిగాయి. ముందుగా శ్రీదేవి పార్థివ దేహాన్ని ఉదయం 9 గంటలకు సెలబ్రేషన్ క్లబ్‌కు ఆమె కుటుంబ సభ్యులు తరలించారు. ఈ సందర్భంగా ఆమె మరుదులు అనీల్ కపూర్, సంజయ్ కపూర్‌లు అక్కడే ఉన్నారు. 2012లో బాలీవుడ్ స్టార్ రాజేశ్ ఖన్నా అంతిమయాత్ర తర్వాత అంతటి స్థాయిలో జరిగింది ఇదే. నిజానికి ఒక నటికి ఇంతటి పెద్దస్థాయిలో అంతిమయాత్ర జరగడం విశేషం. ఈ యాత్రలోపెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. మొత్తం ఏడు కిలోమీటర్ల దూరం సాగిన ఈ అంతిమయాత్రకు రెండు గంటల సమయం పట్టింది. అంత్యక్రియలను ఆమె భర్త బోనీ కపూర్, కుటుంబ సభ్యులు, సన్నిహితులు నిర్వహించారు. ఉత్తర-దక్షిణ భారత్‌ల్లో సూపర్‌స్టార్‌గా వెలిగిన శ్రీదేవి తన నాలుగవ ఏట సినీరంగంలో ప్రవేశించింది.