క్రీడాభూమి

టీ-20 ముంబయి లీగ్ చీఫ్ మెంటర్‌గా వెంగ్‌సర్కార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 9: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ టీ-20 ముంబయి లీగ్ జట్టుకు చీఫ్ మెంటర్‌గా నియమితుడయ్యాడు. ఈ లీగ్ మ్యాచ్ ఈనెల 11 నుండి 21 వరకు జరుగుతుంది. తమ జట్టు చీఫ్ మెంటర్‌గా వెంగ్‌సర్కార్ నియామకాన్ని ముంబయి క్రికెట్ అసోసియేషన్, ప్రోబబిలిటీ స్పోర్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (పీఎస్‌ఐపీఎల్) ధృవీరిస్తూ అతనిని తమ జట్టుకు కల్నల్‌గా అభివర్ణించాయి. గతంలో ముంబయి జట్టుకు, ఆ తర్వాత భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా కూడా దిలీప్ వెంగ్‌సర్కార్ సేవలు అందించాడు. లీగ్ జట్టుకు తనను చీఫ్ మెంటర్‌గా ఎంపిక చే యడంతో యువ క్రికెటర్లు అన్ని విభాగాల్లో పరిణితి సాధించేందుకు వారిని అన్నివిధాలా ప్రోత్సహిస్తానని అన్నాడు. యువ క్రికెటర్లు చక్కగా రాణించేందుకు తద్వారా భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ టోర్నీలలో అవకాశం చేజిక్కించుకునేందుకు ఇది సరైన వేదిక అని వ్యాఖ్యానించాడు.