క్రీడాభూమి

‘గ్రేడ్-ఎ+ ఆలోచన ధోనీ, కోహ్లీదే’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 9: క్రికెట్‌లో ‘గ్రేడ్-ఎ’+ కేటగిరి ప్రవేశపెట్టాలన్న ఆలోచన ధోనీ, కోహ్లీలదే అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. కొత్తగా ప్రవేశపెట్టిన ‘గ్రేడ్-ఎ’లో కేవలం ఐదుగురు ప్లేయర్లకు మాత్రమే స్థానం దక్కింది. వీరిలో ఒక్కొక్కరి వార్షిక కాంట్రాక్టురూ.7 కోట్లు. ఇందులో విరాట్ కోహ్లీకి కూడా స్థానం దక్కింది. అయితే ధోనీని ‘ఎ’ కేటగిరీలో ఉంచడం వల్ల అతని వార్షిక కాంట్రాక్టు రూ.5కోట్లు. ధోనీతో పాటు రవీంద్ర జడేజా, మురళి విజయ్, ఛతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే, వృద్ధిమాన్ సహా కూడా ఈ కేటగిరిలో స్థానం సంపాదించారు. ధోనీ డిమోషన్‌కు కారణమేంటని బీసీసీఐ అధికారి ఒకరిని ప్రశ్నించగా, ‘‘ ఇందులో లాజిక్ ఏమీ లేదు. ఆడిన వారికి ఆడినంత. ఎ+ గ్రేడ్‌లో ఉన్న ఐదుగురు ఆటగాళ్లు మూడు ఫార్మాట్లలో ఆడుతున్నారు. అందువల్ల వారికి ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సిందే. ఈ విషయంలో రవిశాస్ర్తీ, ధోని, కోహ్లీలను కూడా సంప్రదించాం’’ అన్నారు. ‘‘ఆటలో మంచి ప్రావీణ్యం ప్రదర్శించే వారికోసం ఎ+ గ్రేడ్ ఏర్పాటు చేయాలని ధోనీ, విరాట్ కోహ్లీలే సూచించారు. ఇక్కడ గుర్తించాల్సిన ముఖ్యాంశమేమంటే, ఎ+ గ్రేడ్‌కు మూడు ఫార్మాట్లలో ఆడే ఆటగాళ్ళే ఎంపికవుతారు. అదీ టాప్ 10 ర్యాంకుల్లో ఉన్నవారికి ఈ అవకాశం దక్కుతుంది. అందువల్ల ఈ కేటగిరీలో ఏ ఆటగాడికి పర్మినెంట్ స్లాట్ లభించదు,’’అని బీసీసీఐ అధికారి వినోద్‌రాయ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం బ్యాట్స్‌మెన్‌లు కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, పేసర్లు భువనేశ్వర్ కుమార్, జస్ప్రిట్ బుమ్రాలు ఎ+ గ్రేడ్‌కు ఎంపికయ్యారు. వీరిలో ఒక్కొక్కరు వార్షికంగా రూ.7 కోట్లు కాంట్రాక్టు మొత్తాన్ని పొందుతారు. ఇక మహమ్మద్ షమీపై భార్య గృహహింస కేసు పెట్టిన నేపథ్యలో అతడిని పక్కన పెట్టారు. యువరాజ్ సింగ్, రిషభ్ పంత్‌ల పేర్లు జాబితాలో చోటుచేసుకోలేదు. ‘బి’ కేటగిరిలో కెఎల్ రాహుల్, ఉమేష్ యాదవ్, కులదీప్ యాదవ్, యజువేంద్ర ఛాహల్, హార్దిక్ పాండ్యా, ఇషాంత్ వర్మ, దినేష్ కార్తిక్‌లు స్థానం సంపాదించారు. గ్రేడ్ ‘సి’లో కేదార్ జాదవ్, మనిష్ పాండే, ఆక్సర్ పటేల్, కరుణ్ నాయర్, సురేష్ రైనా, పార్థివ్ పటేల్, జయంత్ యాదవ్‌లున్నారు. ఈ గ్రేడ్ వార్షిక కాంట్రాక్టు రూ.3 కోట్లు కాగా, గ్రేడ్ ‘సి’ వార్షిక కాంట్రాక్టు రూ.కోటి. ఈ వార్షిక కాంట్రాక్టులు 2017, అక్టోబర్ నుంచి, 2018, సెప్టెంబర్ నెలాఖరు వరకు కొనసాగుతాయి. గతంలో టాప్ కేటగిరి కాంట్రాక్టు రూ.2 కోట్లు కాగా దాన్ని బీసీసీఐ 350 రెట్లు పెంచి రూ.7కోట్లు చేసింది. ఇక రెండో కేటగిరి మొత్తం 500 రెట్లు పెరిగి రూ.5కోట్లకు చేరుకుంది.