క్రీడాభూమి

ప్రపంచ కప్‌లో భారత్‌కు మరో పతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెక్సికో, మార్చి 9: ఐఎస్‌ఎస్‌ఎఫ్ సీనియర్ ప్రపంచకప్‌లో భారత ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. టోర్నీలో భాగంగా ఆరోరోజు నిర్వహించిన మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్‌లో భారత క్రీడాకారిణి అంజుమ్ మోద్గిల్ 454.2 పాయింట్లు సాధించి రజత పతకాన్ని దక్కించుకుంది. చైనాకు చెందిన రజియో 455.4 పాయింట్లు సాధించి స్వర్ణ పతకం గెలుచుకోగా ఇదే దేశానికి చెందిన టింగ్ సున్ 442.2 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. చంఢీగడ్‌కు చెందిన 20 ఏళ్ల అంజుమ్‌కు ఇదే తొలి అంతర్జాతీయ పతకం కావడం విశేషం. పురుషుల 25 మీటర్ల రాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్‌లో భారత్‌కు నిరాశే ఎదురైంది. ఈ విభాగంలో పతకం తెస్తాడని భావించిన అనిశ్ భన్‌వాలా ఏడో స్థానంలో నిలిచాడు. మరో భారత ఆటగాడు నీరజ్ కుమార్ 13వ స్థానానికి పరిమితమయ్యాడు. అంజుమ్ సాధించిన పతకాల సంఖ్య 8కి చేరింది. ఇందులో మూడు స్వర్ణం, ఒక రజతం, నాలుగు కాంస్య పతకాలతో భారత్ ఆగ్రస్థానంలో కొనసాగుతోంది.
వింటర్ పారా ఒలింపిక్స్ ప్రారంభం
పయాంగ్‌చాంగ్, మార్చి 9: దక్షిణ కొరియా పయాంగ్‌చాంగ్‌లో పారా ఒలింపిక్ గేమ్స్ ప్రారంభమయ్యాయి. 2018 సంవత్సరానికిగాను నిర్వహిస్తున్న ఈ క్రీడోత్సవాలు ఈనెల 9 నుంచి 18 వరకు నిర్వహిస్తారు. పది రోజుల పాటు జరుగుతున్న ఈ క్రీడల్లో పాల్గొనేందుకు 49 దేశాలకు చెందిన 650 మంది క్రీడాకారులు హాజరయ్యారు. రష్యా సోచిలో గత సంవత్సరం నిర్వహించిన వింటర్ ఒలింపిక్స్‌లో 570 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ ఏడు నిర్వస్తున్న క్రీడోత్సవాలను గతంతో పోల్చిచూస్తే 80 మంది క్రీడాకారులు అధికంగా రికార్డు స్థాయిలో పాల్గొన్నారు. 80 మిడిల్ ఈవెంట్స్‌తో పాటు ఆరు క్రీడాంశాలు ఆల్‌పైన్ స్కీప్పింగ్, బైథ్లాన్, క్రాస్‌కంట్రీ స్కింగ్, ఐస్ హాకీ, స్నోబోర్డు, వీల్ చైర్ కర్లింగ్ వంటి అంశాల్లో పోటీలు నిర్వహిస్తారు. పారా ఒలింపిక్స్‌ను తిలకించేందుకు అభిమాను ఈసారి పోటీపడి టికెట్‌లు కొనుగోలు చేశారు. ఈసారి క్రీడా పోటీలను తిలకించేందుకు, ప్రత్యేకించి ఐస్ హాకీ పోటీలను తిలకించేందుకు అభిమానులు తమ ఉత్సాహాన్ని చూపారు. ఈ క్రమంలో 2లక్షల 75 వేల మంది పోటీలను తిలకించేందుకు టికెట్లు కొనుగోలు చేశారు.