క్రీడాభూమి

దక్షిణ మండలం జట్టులో ప్రణీత్‌రాజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 9: ప్రతిష్టాత్మకమైన విజ్జీ ట్రోఫీ యూనివర్సిటీస్ క్రికెట్ టోర్నమెంట్‌ను ఈనెల 20 నుంచి 23 వరకు భువనేశ్వర్‌లోని కేఐఐటీ యూనివర్సిటీలో నిర్వహిస్తారు. ఈ టోర్నీలో పాల్గొంటున్న దక్షిణ మండలం జట్టుకు సంబంధించిన శిక్షణ శిబిరం ఈనెల 15 నుంచి 19 వరకు విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీకి చెందిన రఘు ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా టోర్నమెంట్‌లో పాల్గొంటున్న 16 మంది సభ్యులు కలిగిన దక్షిణ మండలం జట్టును ప్రకటించారు. ఈ జట్టుకు ఎంపికైన వారిలో హైదరాబాద్ నగరం నుండి జెఎన్‌టీయూకి చెందిన ఆల్‌రౌండర్ ఎస్.ప్రణీత్‌రాజ్‌కు స్థానం దక్కింది. హైదరాబాద్ నగరం నుండి ఎంపికైన వారిలో ఒకడైన ప్రణీత్ రాజ్ ఫాస్ట్ బౌలర్‌తో పాటు బ్యాట్స్‌మన్ కావడం విశేషం. ప్రస్తుతం ప్రణీత్‌రాజ్ మీర్‌పేట్‌లోని ఇంజనీరింగ్ ఐటీ విభాగంలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కాగా, దక్షిణ మండలం జట్టుకు కెప్టెన్‌గా కొట్టాయాం మహాత్మాగాంధీ యూనివర్సిటీకి చెందిన సిజోమెన్ జోసెఫ్ నాయకత్వం వహిస్తాడు. జట్టుకు కెప్టెన్‌గా మహాత్మా గాంధీ యూనివర్సిటీ కొట్టాయాంకు చెందిన సీజోమెన్ జోసెఫ్ నాయకత్వం వహిస్తారు. కాగా, జట్టు కోచ్‌గా నెల్లూరు విక్రమ్ సింహ యూనివర్సిటీకి చెందిన క్రికెట్ కోచ్ ఎం.చంద్రశేఖర్, మేనేజర్‌గా విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలోని రఘు ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ఫిజికల్ ఎడ్యుకేషన్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జీసీహెచ్.సూర్యనారాయణరాజు వ్యవహరిస్తాడు. దక్షిణ మండలం క్రికెట్ జట్టుకు ఎంపికైన వారిలో యూనివర్సిటీ ఆఫ్ కాలికట్ కేరళకు చెందిన రోహన్ ఎస్.కునామల్, జోఫిన్ జోస్, కేసీ.అక్షాయ్, కొట్టాయాం మహాత్మా గాంధీ యూనివర్సిటీకి చెందిన అభయ్ జతిన్, సీజోమెన్ జోసెఫ్ (కెప్టెన్), అఖిల్ అనిల్, అమోల్ పి రాజీవన్, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ చెన్నైకి చెందిన ముకుంద్, సుమంత్ జైన్, ఎస్.సిద్ధార్ధ్, ఆకాష్ సుమ్రా, కాకతీయ యూనివర్సిటీ వరంగల్‌కు చెందిన కే.యోగేందర్, కృష్ణా యూనివర్సిటీ మచిలిపట్నంకు చెందిన ఎంఎస్.నిఖిల్‌నాయుడు, విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీకి చెందిన యుఏవీ వర్మ, గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి చెందిన శంబు అఖీల్, హైదరాబాద్ జేఎన్‌టీయూకు చెందిన ప్రణీత్‌రాజ్ ఎంపికయ్యాడు. ప్రవీణ్‌రాజ్ ఇప్పటివరకు టోర్నమెంట్‌లో పాల్గొని బ్యాటింగ్, బౌలింగ్‌లో ప్రతిభ కనబరిచాడు. పదేళ్ల క్రికెట్‌లో ఆరంగేట్రం చేసిన ప్రణీత్ అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం దక్షిణ మండలం జట్టుకు ఎంపికయ్యాడు. 2014లో ఢిల్లీలో జరిగిన అండర్-16 కోకాకోలా కప్ క్రికిట్ టోర్నమెంట్‌లో బంగ్లాదేశ్ జరిగిన మ్యాచ్‌లో పాల్గొన్నాడు. హైదరాబాద్ నగరం నుండి ప్రణీత్ ఒక్కడే భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఆలిండియా స్థాయి యూనివర్సిటీస్ జట్లు పాల్గొంటున్న విజ్జీ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు జరిగిన ఇంటర్ ఇంజనీరింగ్ కాలేజీ క్రికెట్ టోర్నమెంట్‌లో చక్కటి ప్రతిభను కనపరిచి, దక్షిణ మండలం జట్టుకు ఎంపికయ్యాడు. అనంతరం దక్షిణ మండలం స్థాయిలో కూడా అసాధారణ ప్రతిభను కనపరిచిన జట్టుకు ఎంపికయ్యాడు. ఇటీవల హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జీ.వెంకటస్వామి స్మారక ట్రోఫీ టీ-20 లీగ్ టోర్నమెంట్‌లో మెదక్ మేవరిక్స్ జట్టు తరపున ఆడిన రైట్ ఆర్మ్ ఫాస్ట్‌బౌలర్ ప్రణీత్‌రాజ్ అత్యధికంగా వికెట్లు తీసుకుని టోర్నమెంట్‌లో ఉత్తమ బౌలర్ అవార్డును కూడా కైవసం చేసుకున్నాడు. ఆవార్డు కింద రూ.10వేలు నగదు పురస్కారాన్ని అందుకున్నాడు.
chitram...
దక్షిణ మండలం జట్టుకు ఎంపికైన హైదరాబాదీ
ప్రణీత్ రాజ్