సాహితి

కవిత్వోదయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యుడు ఉదయించే ఉంటడు
జగతిలో ఎప్పుడూ
రవికిరణాల్ని, కవి భావనల్ని ఎవరాపుతారు?
ఎవరి పేరును ఎవరు రాస్తరు,
ఎవరు తొలగిస్తరు నిజంగా?
కవి రవిలా వెలుగాలి గాని,
చీకట్లో మినుగురుల్ల ఉండి
సూర్యతేజానే్న కాదంటే ఎట్ల?
రవి కిరణానికి,
కవి భావానికి భేదభావాలేముంటయి?
నిత్యం వెలుగును ప్రసరిస్తూనే ఉన్నడు సూర్యుడు
ఎవరి తేజం వారిదే సహజంగా
బహుశా ఎవరి పేరును వారే
లిప్యంతరంగావించాలి
సూర్యుడిలా ప్రజ్వలించి ప్రకాశించాలె
ఎంత అల్పుడు మనిషి, కవి!
సత్యాన్ని బహిర్గతం చేసే శక్తి లేనప్పుడు
పసిడిని గుర్తించే వరుసనేది కానప్పుడు
కవినని చెప్పుకొనే నైతికశక్తి ఎక్కడిది?
కన్నీళ్ళు కవిత్వం ఊరెకె పుట్టవు
కోటి హీలియం రేణువుల సంయోగంతో
సూర్యునిలో మిలియన్ కోట్ల
కాంతి పుంజాలు పుట్టి
జగతికి వెలుగునిచ్చినట్లు
ప్రకృతిలోని, వాతవరణంలోని అసమతలకు లావాలు ఉప్పొంగినట్లు,
తుఫానులు, టోర్నిడోలు చెలరేగినట్టు
సమాజ దుష్కరుల ముష్కర చర్యలకు
గుండెలు ఉప్పొంగి
మేఘాలు గర్జించి
పుడమి తల్లి ఒడిల వర్షించినట్టు
కవి హృదయంలోంచి
కవితానదులు ప్రవహిస్తయి
సూర్యోదయంలా, కవిత్వోదయం అవుతుంది.

- సబ్బని లక్ష్మీనారాయణ 8985251271