సాహితి

మేటి రచయతల మేలి పరిచయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డాక్టర్ దేవరాజు మహారాజు సైన్స్ పరిశోధకుడు. సాహిత్యంలో కూడా అతని శోధనలు శాస్ర్తియంగా సాగుతాయి. గతంలో ఈయన కవితా భారతి పేరున భారతీయ భాషలలోని కవులు, వారి కవితలను తెలుగు పాఠకులకు పరిచయం చేసారు. ఆ ప్రయత్నంనుంచి ముందుకు సాగి ఈ పుస్తకంలోని వ్యాసాల ద్వారా తెలుగునుంచి మొదలు ప్రపంచ భాషలలో కొన్నింటివరకు ఎందరో రచయితలను పరిచయం చేస్తున్నారు. బాగా చదివే అలవాటున్న రచయిత, రచనలను, రచయితలను విశే్లషించడానికి పూనుకుంటే తప్పకుండా ఆసక్తికరమైన సమాచారం ముందుకు వస్తుంది. ఈ పుస్తకమే అందుకు ఉదాహరణ. ఈ పుస్తకంలో మొత్తం 160 మంది రచయితల పరిచయ వ్యాసాలున్నాయి. వీటిలో 15 తెలుగు సాహిత్యానికి సంబంధించి నవి. ఆళ్వారుస్వామి, దాశరధి, నెల్లూరు కేశవస్వామి, జ్వాలాముఖి, రోహిణీ ప్రసాద్ లాంటి వారి గురించి రాసారంటే అందరూ రాస్తున్నవారి గురించి కాక కొంచెం వెతికి మంచి రచయితలను పరిచయం చేసినట్టు చెప్పుకోవాలి. ఈ వ్యాసాలలో అక్కడక్కడ రచయిత స్వయంగా కనిపిస్తారు. అంటే ఆయా రచయితలతో తనకున్న పరిచయాన్ని కూడా రచనకు ఆధారంగా వాడుకున్నారు! 16 నుంచి 61 వరకు సంఖ్యలు గల వ్యాసాలు భారతీయ భాషలలో పేరెన్నికగన్న రచయితల గురించినవి. గాలిబ్ గురించి రాస్తే ఆశ్చర్యం లేదు. కానీ భారతీదాసన్, మంటో, కుసుమాగ్రజ్, లంకేష్ మొదలైన పేర్లు పాఠకుని ఆసక్తిని పెంచుతాయి. ఓ.వి.విజయన్, జస్‌పాల్ భట్టి, ధసాల్ లాంటి పేర్లు, వ్యాసాలు ఒక భావజాల పరిధికి లోబడినవి కావని నిరూపిస్తాయి. రచయిత పఠనానుభవంలోని విస్తృతికి ఈ వ్యాసాలు ఉదాహరణలు. అంత అనుభవాన్ని పాఠకులందరికీ పంచడం మరింత మెచ్చదగిన విషయం. వ్యాసాలు కొన్ని దీర్ఘంగా, కొన్ని మరీ చిన్నవిగా ఉన్నాయి. అయినా అర్ధం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక్క మాట. ‘కతల్ నివైపుకళ్’ అని రాసిన ఈ రచయిత మరోచోట ‘్భరతి నినై ఊహల్‌‘ అని రాశారు. తమిళంలో నివైపుగళ్, (కళ్, హళ్) అంటే కలలు. అన్యభాషల గురించి రాసే వారికి తరుచు ఎదురయ్యే సమస్యే ఇది. అందుకే ఇటువంటి పుస్తకాలు, వ్యాసాలను ప్రచురణకు ముందుగా, ఆయా భాషలతో పరిచయం ఉన్నవారికి చూపించాలి. పుస్తకాలకు సంపాదకులు ఉండాలి. అప్పుడు ఈ ఉత్తమ రచనలు మరింత బాగా వస్తాయి. ‘బానియన్ ట్రీ’ ఉండదు. గ్రాహం గ్రీన్ అని రాయాలి మరి! ఇక దేశం పరిధిని దాటి మహారాజ మీట్స్, ‘రోమే రోవా’ ప్రాంక్, ఓకానర్, హెరాల్డ్ పింటర్ లాంటి వారి గురించి కూడా రాశారు. చైనా రచయిత మోయాన్ కూడా ఈ పుస్తకంలో కనిపిస్తాడు.
మహారాజు చేసిన ప్రయత్నం చాలా మెచ్చదగినది. ఎక్కడికక్కడే, గిరులు గీసుకుని అందరు బతుకుతున్నారు. చదవడం అనే అలవాటు ఏమవుతున్నదీ తెలియదు. ఈ సందర్భంలో ప్రపంచంలోని, దేశంలోని కలాలను, ఆయా సమయాలను పాఠకులకు గుర్తు చేయవలసిన అవసరం ఎంతో ఉంది. నిజానికి కృషి ఇదే మార్గంలో సాగి, మంచి రచనలు తెలుగులో కూడ అందుబాటులోకి రావాలి. మనగడప మేలు, నిజమే కానీ ఈ ప్రపంచంలో అంతే మంచి, అంతకన్నా మంచి గడపలు చాలా ఉన్నాయి. వాటినీ మనం దాటాలి. చూడాలి.

- కె.బి.గోపాలం, 9849062055