సాహితి

అందమైన భాషలో అమరావతి కైఫీయతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి కైఫీయతు;
వెల: రూ.125/-
ప్రతులకు: విశాలాంధ్ర - నవచేతన

నవ్యాంధ్ర రాజధాని అమరావతి కావటంతో తిరిగి ఈ గ్రామానికి విశేష ప్రచారం లభించింది. అమరావతి మీద లోగడ కొన్ని కథాసంపుటాలు నవలలు పుంఖానుపుంఖంగా వచ్చాయి. ఇప్పుడు డా. వావిలాల సుబ్బారావుగారు ‘అమరావతి కైఫీయతు’ వెలువరించారు. గ్రామ చరిత్రకు కైఫీయతు అని పేరు. అమరావతికి ఒక కైఫీయతు ఉండి ఉండవచ్చు. ఐనా ఇదికూడా కైఫీయతు వంటిదే. నిజానికి ఇందులో అమరావతి గురించి మాత్రమే కాకుండా ఆంధ్రజాతి పుట్టుపూర్వోత్తరాలకు సంబంధించి ఐతిహ్యాలతో మొదలుపెట్టి శాతవాహనుల చరిత్ర దగ్గరినుండి బౌద్ధయుగం మీదుగా ముందుకు సాగారు. మన పురాణములలో శాతవాహన చరిత్ర ఉన్న కొన్ని పేర్లు సమన్వయం కావటం లేదు. ఆ వివరాలు రచయిత ఇచ్చారు. అంతేకాదు తెలుపు నలుపు చిత్రాలు కూడా సందర్భోచితంగా ఉన్నాయి. ఆచార్య నాగార్జునుని సూక్తిరత్నావళి తెలుగు అనువాదం పొందుపరిచారు. (సుహృల్లేఖ నుండి.)
క్రీ.శ.1797 ప్రాంతంలో శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు అమరావతిని రాజధానిగా చేసుకొని పాలించారు. ధరణికోట అలాగే ఉన్నా ఆ ప్రాంతానికి అమరావతి అని పేరుపెట్టింది ఈ ఆధునిక దేవేంద్రుడే. వారి తోటకు నందనవనం అని వారి దర్బారుకు సుధర్మ అని కూడా పేర్లు. అమరావతి బౌద్ధ శైవ సంస్కృతులకు సంగమ స్థలి. ఇక్కడి కోట వంశీయులలో కాకతీయులు వైవాహిక బాంధవ్యాలు పెట్టుకొని కయ్యానికి బదులు వియ్యాన్ని సాధించారు. అంటే ఇదంతా కాకతీయాంధ్ర సామ్రాజ్యంగానే పిలువబడేదని తాత్పర్యం.
కల్నల్ కాలిక్ మెకంజీ 1796లో ఉదహరించిన నగర వర్ణన ఇందులో పొందుపరిచాడు. క్రౌంచామరేతు శబ్దోత్పత్తి పంచారామములలో అమరావతికి గల స్థానము వావిలాలవారు పరిశోధనాత్మకంగా వివరించారు. నిజానికి ఇది పూర్తిగా చరిత్ర గ్రంథమే అయినా సామాన్య పాఠకులను దృష్టిలోపెట్టి భాషలో అభివ్యక్తిలో సారళ్యం పాటించారు. అనుబంధంతో కలిసి మొత్తం పనె్నండు వ్యాసాలున్నాయి. రాష్ట్ర పురావస్తుశాఖ సంచాలకులు డా.జి.వి.రామకృష్ణారావుగారు ఈ గ్రంథానికి తిలకం దిద్దారు. పిత్రూణం తీర్చుకునే నిమిత్తం ఈ సత్‌కృతిని రచయిత తమ తండ్రిగారికి అంకితం చేయటం సముచితంగా వుంది. చారిత్రక పరిశోధకులేకాక సామాన్య పాఠకులు కూడా ఆనందంగా చదువుకోవచ్చు.

- ముదిగొండ శివప్రసాద్