సాహితి

కథాగుణం (శ్రీవిరించీయం 5)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కథ’లో కథ ప్రధానం. కథ ముందుకు కదలాలి. పాత్రలతోపాటు చదువరి గమనాన్నికూడా ముందుకు తీసుకుపోవాలి. పాత్రలతోను, కథాగమనంతోను చదువరి ‘మమేకం’ అయిపోవాలి. ఇది ఒక పద్ధతి అయితే- దానితో సంబంధంలేకుండా చదువరి వ్యక్తిత్వాన్ని మటుమాయం చేయకుండా కథ నడవడం మరో పద్ధతి. కథతో కలిసిపోవడం, కథను దూరంగా గమనిస్తూ వుండిపోవడం అనేవి రెండూ వేరువేరు మార్గాలు. వీటిలో యేది మంచిది, ఉత్తమమయినదీ అని స్ఫుటంగా చెప్పలేము. దేనికదే ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. కథ ‘నా జీవితాన్ని ప్రతిబింబిస్తోందా’ లేక ‘ప్రపంచంలోవున్న ఒక సాధారణ / అసాధారణ జీవిత రేఖలను ప్రదర్శిస్తోందా’ అన్న విషయం మీద భేదాలు, భేద అభిప్రాయాలు వుండటానికి అవకాశం వుంది.
కథావస్తువు మీద ఆధారపడి దాని ప్రమాణాన్ని నిర్ధారణ చేసుకోవడం ఒక మార్గం. వస్తువు వ్యక్తిగతంగా వున్నదా లేక సామాజికపరం అయినదా? వ్యక్తిగతమే అయినా యిందులో సామాజిక న్యాయం కనిపిస్తోందా? కరువు, దరిద్రం, దొంగతనం, దారుణ కృత్యాలు గురించి వ్రాసేటప్పుడు రుూ ప్రస్తావన రావడం సాధ్యం. ఇవి అందరికీ తెలిసిన విషయాలు కాకపోవచ్చు- కాని తప్పనిసరిగా తెలియవలసిన విషయాలు మాత్రం అవును.
కాల్పనిక సాహిత్యంలో ‘ప్రణయం-ప్రేమ’ అనేవి తప్పనిసరి అంశం అని కొందరు భావిస్తారు. కాని కథానికకు అలాంటి నియమం యేమీ లేదు. కథకు అవసరం అయితే ప్రేమ, ప్రణయం ప్రవేశించవచ్చు. విరహం, వివాహం వంటివి చేరవచ్చును. కథ ప్రయోజనం మనిషిని ‘వున్న స్థితి’ నుంచి ‘ఉన్నత’ స్థితికి తీసుకుపోవడం- కథ ఆలోచనలను ప్రవేశపెట్టాలి. కథ చదవటానికి ముందు వుండిన చదువరి మానసిక స్థితి, కథ చదవిన తరువాత యేర్పడిన స్థితీ- ఎంతో వ్యత్యాసం అయినవిగా వుండాలి, తయారవాలి. జీవితం ఎప్పటికప్పుడు కొత్త విషయాలను ప్రదర్శిస్తూ వుంటుంది. మనిషి వాటిని గమనిస్తున్నాడా లేక- కళ్లుమూసుకుని తన దారిన తను వంటరిగా నడిచి వెడుతున్నాడా? ఇతరులతో అతని సంబంధ బాంధవ్యాలు ఎలా వున్నాయి?
కథకు ఏకత, క్లుప్తత ఎంత అవసరం అనుకుంటామో అంతే అవసరం అయినవి మరికొన్ని వున్నాయి. అవి సుందరత - తేజస్సు లాంటివి. రచయిత ప్రావీణ్యం అంతా ధారబోసి తయారుచేసిన కథ సుందర రూపంతోపాటు సౌభాగ్యం, సౌశీల్యం తోడుగా వస్తాయి.
ప్రపంచంలో ప్రతి వస్తువు- యిందులో మనిషి మినహాయింపు కాదు- అయిదు తత్త్వాలతో అంతర్గతంగా నిలిచి వుంది. నేల-నీరు-గాలి- వెలుతురుతోపాటు ‘తేజస్సు’ వీటినన్నిటినీ ఆవరించుకుని వుంటుంది. తేజస్సు ప్రతి అక్షరంలోను పొదిగి వున్నప్పుడే, యేర్పడిన రూపం స్వంతమయిన వెలుగుతో ప్రకాశవంతంగా ప్రభావిస్తుంది. విభవానికి ప్రభవం ప్రారంభమే కాకుండా, ప్రభంజనం, ప్రాథమికం కూడాను. ఈ విషయం మనం మరచి పోగూడదు. ప్రాథమిక అంటే మూల వస్తువు, మూల పదార్థం - యింకా వివరంగా ‘్భమిక’.
కథకు ‘ప్రాణం’ ఎక్కడ వున్నది - అని ఆలోచించినప్పుడు మళ్లీ మనిషినే మనం నమూనాగా తీసుకోవాలి.
మనిషిలో ప్రాణం ఎక్కడ వుంది? కళ్లలోనా, చేతులలోనా, మనస్సులోనా, కనిపించని హృదయంలోనా? వివేకవంతుడికి తెలిసిన విషయం ప్రాణం అనేది ఒకచోట కూర్చుని లేదు. అది అంతటా - శరీరం అంతటా - అనవరతం ప్రయాణంచేస్తూ వుంటుందని.
కథకు బీజం వుంటే, ప్రాణం తోడయి దానిని నిటారుగా నిలబెడుతుంది. ఎత్తిచూపుతుంది. ఎలుగెత్తి చాటేట్లు చేస్తుంది.
కథ ఎంత పొడుగు సాగిందా అనేది కాదు ముఖ్యం. సాగుతున్నంతసేపూ ప్రాణం పోకుండా - కోల్పోకుండా వున్నదా లేదా? కథకు అదే ప్రధానం. ప్రాణం, బీజం కోల్పోయిన కథలు గాలిలో దారం లేకుండా ఎగరేసిన పటాలు. దారం రచయిత చేతుల్లో వుండాలి. అది పాత్రల ద్వారా ప్రదర్శితం కావాలి.

శ్రీవిరించి, ఫోన్ : 09444963584