సాహితి

శ్రీశ్రీ ఎందుకు గుర్తుకురాలేదు? (స్పందన)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

13-6-2016 నాటి సాహితిలో బిక్కి కృష్ణగారు ‘తెలుగు సాహిత్య దౌర్భాగ్యం’ కారణంగా నిబద్ధత ప్రశ్నార్థకమైన, అల్పమతులైన కవులు రచయితలు, కులం, ప్రాంతం, అస్తిత్వం, ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అంటూ రంకెలేస్తూ సృజనకారులు గ్రూపులుగా, కూటాలుగా విడిపోతున్నారని బాధపడ్డారు. కారణం తెలియదుగాని వారు మచ్చుకైనా ఏ ఒక్కరికీ మినహాయింపునివ్వడానికి ఇష్టపడలేదు. కనీసం ఇక్కడొకటి అక్కడొకటి అయినా సరే బియ్యపు గింజలుంటేనే కదా - మట్టిబెడ్డలను ఏరుకునేది. ముఖ్యమంత్రులను తన కవితాస్త్రాలతో ఎదుర్కొన్న శ్రీశ్రీ ఈనాడు లేనందుకు బాధపడ్డారు బిక్కి కృష్ణ. నిజాం పాలనను విమర్శిస్తూ పల్లెత్తు మాట మాట్లాడని శ్రీశ్రీ, పెనె్నత్తి రాయని శ్రీశ్రీ, ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తూ విధించబడిన ‘ఎమర్జెన్సీ’ని కీర్తించిన శ్రీశ్రీ - బిక్కి కృష్ణగారికి ఈ వ్యాసం రాసేప్పుడు గుర్తుకు రాలేదని భావిస్తున్నాను.

- వరిగొండ కాంతారావు