సాహితి

కార్బైడు మనుషులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదయాస్తమయాల్లోని
సూర్యబింబంలా నిగనిగలాడుతూ
అరుణకాంతుల ఆపిల్ పండ్లు
కామధేనువు నిండు పొదుగుల్లా
బరువుగా వ్రేలాడే ద్రాక్షా గుళుచ్ఛాలు
అర్థవలయంలో అమరిన
బంగారు కణికల్లా అరటిపండ్లు
కనువిందు చేస్తూ పసందుగా ఎన్నో పండ్లు
అవేవీ చెట్టు తల్లి పెంపకంలో
పక్వమైన ముగ్ధ ఫలాలు కాదు!

కార్బైడు భూతం కమ్మించిన భయంతో
కృత్రిమ సోయగాన్ని పులుముకొని
కడుపులో రసాయన విషం నింపుకొన్న
కక్కుర్తి పండ్లు, కాసుల పుండ్లు!
ఆకారం, ఆహార్యం రంగస్థలం వరకే
బ్రతుకు పొరల్లోకి ఆహ్వానిస్తే
దగాపడ్డట్లే
చెదరని చిరునవ్వుల
ప్రేమాభినయ చతురులు
వెనె్నల జల్లుల పలకరింపులు
మైత్రీ నటనాభిరాములు
మొసలి కన్నీళ్ళ
శూన్యహస్త శిలాహృదయాలు
అత్త సొమ్ముల వితరణ జామాతలు
మనచుట్టూ ఎందరో ‘కార్బైడు మనుషులు’!
ధృతరాష్ట్రుడిలా వాటేస్తారు
తెలియకుండా కాటేస్తారు
జర భద్రం బిడ్డా!

- డా వై.రామకృష్ణ రావు, 8985743964