సాహితి

ఇక కదం తొక్కే పాదాలు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా మనస్సు వౌనంగా ఘోషిస్తోంది
నిర్విరామ సంచలనాలతో
సహస్రాధిక హృదయాలను
ఉక్కిరిబిక్కిరి చేసి
వేడిని పుట్టించాల్సిన వాడివి
ఏదో సానుభూతి కోసం
తపించడం
ఎవరినుండో ఓదార్పు కోసం
ఎదురుచూడటం ఎంత దారుణం!
తీరని దాహపు నాల్కలతో
సూర్యరశ్మిలో ప్రవహించాల్సినవాడివి
జనారణ్యంలో ఆకులా అతుక్కుపోయ
ఇలా వుండటం
ఎంత దురదృష్టం!
నిన్ను ఏదో సోషల్ సిక్‌నెస్ ఆవహించింది
తోకలు తెగిన చుక్కల్ని చూస్తూ
రాత్రి అంచున నడుస్తూ నడుస్తూ
కాంక్షాదగ్ధ క్షణాలున జార్చుకుంటూ
ఇప్పుడు ఇలా
తెలియని భయవిహ్వలతో
దగ్ధమై
మృత్యువును కాస్త కాస్త చప్పరిస్తూ
నీ ఏకాకితనం
శమించి దమించి
ఒక ఆకారాన్ని ప్రభవించాలి
ఏమో నాకు తెలియని తితిక్ష
నీలో ఉదయంచిందేమో
ఇక నిన్ను
వెనక్కు పిలువను
ఇక నీ క్రాంతి పాదాలు
కదం తొక్కాలి
ఈ వేకువదారంట
అలా అలా నడచి వెళ్ళు..

- డా. ధేనువుకొండ శ్రీరామమూర్తి, 9885297983