సాహితి

నేనెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాలో ననే్న చూడాలనుకునే సందర్భంలో
బంధానుబంధాలు బొందలో కప్పేసి
ఆకాశమంతటా ఆశల్ని నింపేసి
తీరని దాహానికి ఆరని అహానికి
స్వార్ధపు దేహానికి చిరునామానౌతా...

నాలో నేనుగా పరివర్తన చెందాల్సిన సందర్భంలో
గతాల వలయాలు చీల్చుకొని అవి మిగిల్చిన
మచ్చల్ని తుడిచి, నేర్పిన పాఠాల్ని వల్లెవేసి
సాధనా శకటంలో మేధనై పయనించి
ముళ్లను పూలుగా మార్చి పయనవౌతా

నాలో నేనెవరో తెలుసుకునే సందర్భంలో
నీటిలో బింధువునై, మట్టిలో రేణువునై
కాంతిలో రేఖనై, పువ్వులో అందమై, పండులో తీపినై, వేపలో చేదునై, చింతలో పులుపునై,
వగరునై, పొగరునై, అగ్గినై, బుగ్గినై,
ప్రకృతిలో భాగమై పరవశిస్తాను...

- చావలి శేషాద్రి సోమయాజులు