సాహితి

కథా తోరణం 12

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కథ’ అనేది ఎప్పుడు పుట్టింది. ఎలా పెరిగింది, ఏమేం ప్రయోజనాలు సాధించింది అనే విషయాలను గురించి పరిశోధనలు జరుగుతూనే వున్నాయి. కొత్త కొత్త విషయాలు బయలుపడుతున్నాయి. కథ అనేది ఆధునిక యుగంలో పత్రికల కోసం పుట్టిందనీ, అమెరికా బాగా ప్రాచుర్యం సంపాదించిందనీ ఎరుక. పుట్టటం మటుకు ఇంగ్లాండ్‌లోనే. అంతమాత్రంచేత వెనకటి రోజులలో- ప్రాచీన యుగాలలో కథ వేరు అని కొట్టిపారేయాలేము.
ఈజిప్ట్ దేశంలో క్రీస్తుకు పూర్వం 30వేల సంవత్సరాల క్రితమే కథ వున్నదని నిర్ధారణగా చెబుతారు. తాటి ఆకుల మీద శిలాఫలకాల మీద కనిపించిన కథలు భూగర్భ పరిశోధకులకు అందేవే గాని సాహిత్య చరిత్రకారులకు సాధ్యపడేవి కాదు. అలెగ్జాండర్ ది గ్రేట్ ఈ దేశాన్ని గెలుచుకున్న తర్వాత, ఆ పాత సాహిత్యం అంతా మటుమాయం అయిపోయిందని చెబుతారు.
గ్రీస్ దేశంలో క్రీస్తుకు పూర్వం అయిదువందల సంవత్సరాల ముందు కథాసాహిత్యం వున్నట్లు బయలుపడింది. రోమ్ దేశంలో రుూ గ్రీస్ సంప్రదాయాన్ని అనుసరించి రచనలు చేయడం అలవాటు అయింది. ఇక్కడ కథ మంచి ప్రావీణ్యత సంపాదించిందని విమర్శకుల అంచనా. అంతవరకు నీతి కథలకు ప్రాధాన్యత వుంటే, యిక్కడకు వచ్చేసరికి కథకు ఒక సా హిత్య ప్రామాణ్యం యేర్పడింది. రాజుల కథలు, నీతి కథలు కాకుండా కథావస్తువు మార్పులు చెందింది.
భారతదేశంలో ప్రధాన భాష ‘సంస్కృతం’. ప్రాచీన భారతంలో రచనలన్నీ సంస్కృత భాషలోనే జరిగాయి. ప్రాంతీయ భాషలలో రచనలు చేయడం నిషిద్ధం అనే నియమం కూడా వుండింది చాల యుగాలపాటు. ప్రాచీన భాష అయిన సంస్కృతంలోనే వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు రూపుదిద్దుకున్నాయి. వీటన్నిటిలోనూ లెక్కకు లేనన్ని కథలు వున్నాయి. అలాగే బుద్ధజాతక కథలు పాళీభాషలో వచ్చాయి. పంచతంత్రం కూడా బుద్ధ జాతక కథల నాటిదే. తరువాత కొన్ని శతాబ్దాలకు పంచతంత్రంలోని కొన్ని కథలను సంక్షేపకరించి ‘హితోపదేశం’ అనే కథా సంపుటాన్ని క్రీ.శ. పధ్నాలుగో శతాబ్దంలో వెలువరించారు ఒకరు. అన్యాపదేశంగా కథలు చెప్పడం, జంతువుల కథలు తయారుచేయడం భారతదేశంలోనే మొదలయిందని చెప్పవచ్చు. సోమదేవుడు అనే ఆయన 1070 క్రీ.శ.లో ‘కథా సరిత్సాగరం’ అనే కథల సముద్ర గ్రంథం తయారుచేశాడు. అది అంతకుముందే వుండిన గ్రంథానికి సంక్షిప్తీకరణ. మూల గ్రంథం మటుమాయం అయిపోయింది.
సంస్కృత రచనలలో ‘కథలు’గా పరిణామం చెందిన సన్నివేశ కథలు అనేకం వున్నాయి. ఇవి ఖండకావ్యాలుగాను, కథా రూపంలోనూ వెలువడ్డాయి. పరిశీలనగా చూచినప్పుడు ప్రపంచ సాహిత్యంలోనికి కథలు, కథాభాగాలు సరఫరాచేసినది భారతదేశమేనని తోస్తుంది.
సంస్కృతం పక్కనబెట్టి, ప్రాంతీయ భాషలలో రచనలు చే యడం బహుజనామోదం పొందిన తరువాత కథ కూడా అన్ని భాషలలోనూ దాదాపు 150 సంవత్సరాల నుండి ప్రచారంలోనికి వచ్చింది. ఇప్పుడు దేశంలో వున్న ప్రతి భాషలోనూ- కాశ్మీరీ, డోగ్రీ భాషలతో సహా కథా నైపుణ్యాన్ని సంపాదించింది. అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన భాషా కథలు ఎన్నో వున్నాయి మన దేశంలో. హిందీతోపాటు మైథిలీ, ఖరీజోలీ, ఆంగిక, భోజపురి భాషలలో కూడా కథ ప్రావీణ్యం సంతరించుకుంది.
తెలుగులో కాశీ మజిలీ కథలు, మర్యాద రామన్న కథలు, బీర్‌బల్ కథలు, తెనాలి రామకృష్ణ కవి కథలు బహుళ ప్రచారంలో వుండేవి. సమకాలిక సాంఘిక జీవనానికి యివి సోదాహరణగా నిలుస్తాయి. రాజుల కథలు, దొంగల కథలు, యాత్రా విశేషాల కథలు కొన్నాళ్లు ప్రచారంలో వుంటే తరువాత భూస్వాములు, రైతు కూలీలు, కాయకష్టం చేసుకునే వారి కథలు విరివిగా రాసాగాయి. మధ్యతరగతి వాళ్ల కథలు ఎక్కువగా వచ్చినా, అసలు మధ్యతరగతే మధ్య అనే వాళ్లు కూడా వున్నారు. ‘నీవు ఉన్నవాడివి (శ్రీమంతుడివి) లేదా నిరుపేదవు (బీదవాడివి), అంతే కాని మధ్యతరగతి అంటూ ఒకటి ఎందుకు త్రిశంకు స్వర్గం? బీదవాడినని ఒప్పుకోవు, శ్రీమంతుడవు కాలేవు! అంతతో చాలక, మధ్యతరగతిలో ఉచ్ఛ, నీచ కూడా (హ య్యర్, లోయర్)- ఎక్కువ తక్కువ తరగతులు తయారుచేసుకున్నారు. జనాభా లెక్కల ప్రకారం శ్రీమంతులకంటె, బీదవారి కంటె మధ్యతరగతి ప్రజలే ఎక్కువ మంది వున్నారు దేశంలో. అందువల్ల ఈ తరగతిని తక్కువ చేయలేము, తీసి వేయలేము.
ఆధునిక కథ అనేది తెలుగులో 1910లో ప్రారంభం అయింది. అంతకుముందు కొన్ని కథలు వున్నమాట నిజమే గాని వాటిలో ఆధునికతకు చెందిన లక్షణాలు తక్కువ. అలా చూచుకున్నప్పుడు తెలుగు కథకు యిప్పుడు 116 సంవత్సరాల వయసు.
కథాసాహిత్యం అందరికీ అందుబాటులోనికి రావటానికి చేయవలసిన కృషి ఎంతయినా వుంది. విజ్ఞులయినవారు దీనికి తగిన ప్రణాళికలు తయారుచేయించి, అమలుచేయవలసిన శుభ తరుణం మన ముందు వుంది. కథా మార్జాలానికి గంట కట్టేదెవరు?

- శ్రీవిరించి, ఫోన్ : 09444963584