సాహితి

తెలుగు కోసం.. వెలుగు కోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిలుకూరి నారాయణరావు నిత్యపరిశోధకుడు.
రాత్రింబవళ్ళు ఏదో వ్రాయడంలోనూ,
పరిశీలించడంలోనూ, చదవడంలోనూ
నిమగ్నులై ఉండేవారు. వారు చారిత్రక
పరిశోధనల మీద ఎక్కువ మక్కువ
చూపుతూ వచ్చారు. వారు తామ్ర
శాసనాలను చదవడం, శిలాశాసనాలను నకలు చేసుకుని పరిష్కరించడం,
తాటాకు గ్రంథాలని సేకరించడం..
వంటి వాటి మీద ఎక్కువ మక్కువ
చూపించేవారు.

మహామహోపాధ్యాయ పరిశోధక పితామహులు, కళాప్రపూర్ణ డా. చిలుకూరి నారాయణరావుగారు భాషోద్యమంలో కందుకూరు వీరేశలింగం తర్వాత చెప్పుకోదగ్గ పండితులు. గిడుగు రామమూర్తి, గురజాడ అప్పారావుగారి అడుగుజాడల్లో నడచిన వ్యవహారిక భాషా కోవిదుడు. వారి భాషాభిమానం అనన్యమైనది. తెలుగుపై అధికంగా అభిమానం, ప్రోత్సాహం లేని రోజులలో వారు పదకొండవ శతాబ్దమునకు చెందిన తెలుగు భాషపై కృషిచేసి 1928లోనే మద్రాసు విశ్వవిద్యాలయము నుండి తెలుగులో తొలి పిహెచ్.డి పట్టాను పొంది పరిశోధక పితామహులుగా పేరు తెచ్చుకున్నారు.
కందుకూరు తమ సంఘ సంస్కరణోద్యమం ద్వారా తెలుగు సాహిత్య చరిత్రలో ఓ క్రొత్త శకాన్ని ఆరంభిస్తే; గిడుగు, గురజాడ తమ వ్యవహారిక భాషోద్యమం ద్వారా తెలుగు భాషలో నూతన యుగాన్ని సృష్టించారు. వీరి వారసత్వంగా డా. చిలుకూరిగారు దాదాపు 250 గ్రంథాలు రచించారు. సామెతలు ఒక లక్ష. వీరి గ్రంథాలలో ప్రముఖమైనది తెలుగు భాషా పరిశోధకులకు తలమానికమైనది ‘ఆంధ్ర భాషా చరిత్రము’. దీనిని 1937లో ‘ఆంధ్ర విశ్వకళాపరిషత్తు’ వారు ప్రచురించారు. ఈ గ్రంథం అనేక విమర్శలకు కూడా గురయింది. ఎందుకంటే ఈ గ్రంథం అప్పట్లో బిషప్‌గా వుండిన భాషా పరిశోధకులు కాల్జ్వెల్ వాదాన్ని ఖండించింది. తద్వారా ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొన్న తన వాదాన్ని విడవకుండా డా. చిలుకూరివారు భాషాకోవిదులకు, పెద్దలకు వివరిస్తూ వచ్చారు. ఇది ఆయన నిత్య పరిశోధక కృషికి నిదర్శనం.
అందుకే ఆయన తననుతాను ‘‘వాఙ్మయ తపస్వి’’గా చెప్పుకున్నారు. వాస్తవంగా కూడా ఆయన వాఙ్మయ తపస్వినే అని నిరూపించుకున్నారు కూడా. వారు బహుభాషా కోవిదులు. ఆయన భారతీయ భాషలతోపాటు ఆంగ్లం, జపనీస్, ఉర్దూ, అరబిక్ భాషలను నేర్చుకొని ఎన్నో పుస్తకాలను అనువదించారు. వాటిలో ఖురాన్ షరీఫ్ ఒకటి. ఆంగ్లంలో ఎన్నో పుస్తకాలను అనువదించారు. ఆయన రచనలు తెలుగు, ఆంగ్లం, కన్నడం... తదితర భాషలలో చేశారు. వారు రచించిన తెలుగు, ఆంగ్లం కవితలను, గేయాలను ఈనాడు ప్రభుత్వ కళాశాల (యుజి అండ్ పిజి) (స్వయం ప్రతిపత్తి) అనంతపురము అని చెప్పుకొనుచున్న ఆనాటి దత్త మండల కళాశాల పురుడుబోసుకున్న కళాశాల మేగజైన్లలోను, ఆంధ్రపత్రిక, శ్రీ సాధన పత్రిక.. తదితర వివిధ పత్రికలలో ప్రచురించడం జరిగింది. పిఠాపురం యువరాజావారు రచించిన ‘‘చినుకుల చిందులు’’ అన్న కావ్యాన్ని ‘్దళ ఘెశషళ యచి ఆ్దళ గ్ఘజశ యోఔ’’ అన్న పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు. అందులో ‘క ఘఒఆళూ’’ అన్న పేరుతో ఉన్న చిన్న ఆంగ్ల కవితను అప్పట్లో దత్త మండల కళాశాల (్ళళజూళజూ జఒఆజషఆఒ ళ్యళళ) అనంతఫురము మేగజైన్ పేజి-18లో ప్రచురించడం జరిగింది. అలాగే సంస్కృతంలో ‘‘విక్రమాశ్వర్దమాయమే’’ వ్రాసారు. అలాగే కన్నడంలో కూడా రచనలు చేసారు.
ఆయన నిత్యపరిశోధకుడు. రాత్రింబవళ్ళు ఏదో వ్రాయడంలోనూ, పరిశీలించడంలోను, చదవడంలోను నిమగ్నులై ఉండేవారు. వారు చారిత్రక పరిశోధనల మీద ఎక్కువ మక్కువ చూపుతూ వచ్చారు. వారు తామ్ర శాసనాలను చదవడం, శిలాశాసనాలను నకలు చేసుకుని పరిష్కరించడం, తాటాకు గ్రంథాలని సేకరించడం.. వంటి వాటి మీద ఎక్కువ మక్కువ చూపించేవారు. ఒక సందర్భంలో అనంతపురము జిల్లా గుత్తి మండలంకు ఏడు మైళ్ల దూరాన పత్తికొండ తాలుకాలోని ఎర్రగుడి గ్రామంలో అశోకుని శాసనాలు ఉన్న విషయాన్ని దొరలు గుర్తించినా వాటి వివరాలు ఇవ్వలేదని రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ అన్నగారైన కర్నామడకల రామకృష్ణమాచార్యులను (ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల (స్వ)పూర్వ విద్యార్థి 1916-17) వెంటబెట్టుకొని ఆ గ్రామానికివెళ్ళి వాటిని పరిశోధించి ఐదు శాసనాలకు పాఠాలు వ్రాసుకున్నారు. మిగతా శాసనాలను పురావస్తు శాఖ పరిశోధించాలని కోరారు. అంతేగాక ఈ శాసనాలపై ఒక పుస్తకాన్ని కూడా ప్రచురించారు. 1929 ఆగస్టు 18న ‘‘ఆంధ్రదేశీయేతిహాస పరిశోధక మండలి’’ వారి ఆహ్వానం మేరకు రాజమండ్రిలోని హిందూ సమాజ భవనంలో ‘‘ఆంధ్రదేశములోని అశోకుని శాసనాలు’’ అనే అంశంపై ఉపన్యసించారు. ఆనాటి చారిత్రక పరిస్థితులను తెలిపే శాసనాలు అత్యంత ప్రధానమైనవి ఇప్పటికీ రాయలసీమ గ్రామాలలో, కొండ గుట్టలలో అధ్యయనం చేయగల్గితే ఎన్నో శాసనాలు లభిస్తాయనటంలో అతిశయోక్తిలేదు. కాని ఈ కాలంలో డా.చిలుకూరి వారిలాగ పరిశోధించగల్గినవారెవరు? పరిశోధకులు ఈవైపుగా ప్రయత్నాలను కొనసాగించాల్సిన ఆవశ్యకత ఎంతో వుంది.
సీమ కథా తొలకరి
ఆధునిక సాహిత్య ప్రక్రియలలో నవల, కథానికలు ప్రధానమయినవి. వీటిలో ఒకటైన కథానికకు నూరేళ్లకు పైగా చరిత్ర ఉంది. భారతదేశంలో మొదటి కథానిక 1805లో పశ్చిమ బెంగాల్‌లో ‘‘తాతాఇతిహాస్’’ చండీచరణ్ రచన. కాని తెలుగులో మాత్రం 1910లో గురజాడ వారి ‘‘దిద్దుబాటు’’ తొలి కథానిక అని మొన్నటిదాకా సాహిత్య విమర్శకుల అభిప్రాయం. కాని పరిశోధకుల కృషివల్ల 1902 నవంబర్‌లో ‘‘హిందూ సుందరి’’ పత్రికలో వచ్చిన ‘‘్ధనత్రయోదశి’’ అనే కథ ద్వారా ‘‘బండారు అచ్చమాంబ’’ ఉనికిలోకి వచ్చింది. అలాగే ఆధునిక రాయలసీమ కథ మిగతా ప్రాంతాలకంటే ఆలస్యంగా వచ్చిందనుకునే వాళ్ళం. 1940 తర్వాత రాసిన కె.సభా, జి.రామకృష్ణగార్లనే తొలి కధకులుగా భావించేవాళ్ళం! దీన్ని పూర్వపక్షం చేస్తూ డా.చిలుకూరిగారు 1935 ప్రాంతాల్లోనే ‘‘తరువాత’’? అనే కథను రాసారని ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డిగారు తన ‘‘అశాంతి బ్రతుకుల శిల్పి శాంతి నారాయణ’’ అనే వ్యాసంలో పేర్కొన్నారు. అలాగే డా.చిలుకూరివారు ‘‘తెరలు’’ భారతి పత్రిక మార్చి 1941, దీనికంటే ముందు అనగా 1936 మార్చి ‘‘తలవ్రాత- నుదుటి రాత’’ (మాడపాటి హనుమంతరావు షష్ఠిపూర్తి సంచిక) కథ వ్రాసారు. దీనినిబట్టి డా.చిలుకూరి వారి సన్నిహితులైన గుత్తి రామకృష్ణ కంటే ముందే రాయలసీమ కథానిక డా.చిలుకూరి ద్వారా ప్రారంభమయిందని గుర్తించారు.
కాలక్రమంలో చరిత్ర, సాహిత్య పరిశోధకులైన సంగిశెట్టి శ్రీనివాస్, తవ్వా వెంకటయ్య (కడప), అప్పిరెడ్డి హరినాథరెడ్డి (అనంతపురము)లు 1882 జూలై జన వినోదిని పత్రికలో ప్రచురితమైన ‘‘ఋతుచర్య’’ తొలి కథగా మరియు కథ, కథకుడు లభ్యమైనంతలో 1913 అక్టోబరు 1, హిందూ సుందరి పత్రిక ప్రచురితమైన గాడిచెర్ల హరిసర్వోత్తమరావుగారు రచించిన ‘‘రోజాంబ, శే్వతాంబ’’ కథ ద్వారా రాయలసీమ కథానికా చరిత్రను పునర్లిఖించారు.
ఆయన మొట్టమొదటి వ్యాసం ‘‘తెలుగునందలి దేశ్యాదేశ్య పదజాలము’’ 1916లో ఆంధ్ర సరస్వత పరిషత్పత్రికలో ప్రచురింపబడింది. వీరు సృష్టించిన సాహిత్యం అనన్యమైనది. ఈనాడు మనం ‘‘అభ్యుదయం, విప్లవం, స్ర్తివాదం’’ అనే పేర్లతో పిలుచుకునే సామాజిక సాహిత్యాన్ని చిలుకూరివారు 20వ శతాబ్దం ప్రారంభంలోనే సృష్టించారు.
అభ్యుదయ భావాల స్ఫూర్తి ప్రదాత
డా.చిలుకూరివారు సాహిత్య, సామాజిక కార్యక్రమాలేగాక హృదయ విశాలత కల్గినవారు. రాజారామ్మోహనరాయ్, వీరేశలింగం పంతులు... తదితరుల అడుగుజాడల్లో నడవడమేగాక తమ జీవితానుభవంలోకి అన్వయించుకున్నారు కూడా. స్ర్తి విద్యతోపాటు, స్వాతంత్య్రం సమాన హక్కులు కూడా అవసరమని కార్యరూపేణా జరిగింది చూపించారు.

- సాబాద లక్ష్మిదేవి