సాహితి

ఊపిరి కొనల మీద...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఊపిరి కొనల మీద
అగ్నిజ్వాల రగులుతోంది

ఉడికిన కళింగాంధ్ర జీవితాల మీద
అణు విద్యుత్ కొవ్వాడ
విధ్వంస దృశ్యమవబోతోంది

మరో దుఃఖానికి
సన్నాహమవుతోంది

చినుకుల్ని దున్నుకున్నట్లు
ప్రమాదాల్ని మోయలేం
అణు విధ్వంసాల్ని ఆపలేం

ఒక కలల ప్రపంచానికి
ఒక పవన విద్యుత్ చాలు
ఒక సోలార్ విద్యుత్ చాలు
ఒక సంద్ర కెరటాల విద్యుత్ చాలు
ఒక ప్రవహించే నీటి విద్యుత్ చాలు
నన్ను నేను సౌకర్యవంతం
చేసుకోవడానికి
విధ్వంసం అవసరం లేదు

ఎన్నో వినూత్న మార్గాల
అనే్వషణ జీవులం కదా మనం...!

- గవిడి శ్రీనివాస్ 08722784768