సాహితి

రియల్ హీరో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదాయ వ్యయాలతో సుఖాన్ని అంచనా వెయ్యొచ్చు కానీ
ఆదాయ వ్యయాలతో ఆనందాన్ని కొలవలేము
కోటిమంది ముందు నటించే హీరోకు కోట్ల రూపాయలిస్తారు
పత్రికలో కనిపించినా ఒకోసారి కవికి పైసా కూడా అందదు
హీరో నటిస్తాడు - కవి జీవిస్తాడు
పాఠక దేవుళ్ళయినా, వీక్షక దేవుళ్ళయినా
డబ్బులిచ్చుకోందే వినోదాన్ని పుచ్చుకోలేరు
వివేకం నిండిన కవికి విలువ కట్టలేం
నిజమైన కవి దగ్గర జనాకర్షక పథకాలుండవు
కవి సత్యం వెంట వుంటాడు, సంక్షోభం వెంట వుంటాడు
సంఘర్షణ వెంట వుంటాడు, సౌందర్యం వెంట వుంటాడు
రేటింగు లేని, ఓటింగు లేని, ఛీటింగు లేని
రేయింబవళ్ళ మీద చేతులు వేసి హాయిగా సాగే కవిని చూశారా?
సంపదతో నిమిత్తం లేని సంతోషం అతనికి తెలుసు..
జనమంతా హీరోలని చూసి ఈర్ష్యపడితే
హీరోని చూసి కవి జాలిపడతాడు
కారణం నేటి హీరో రేపటి జీరో
జీవితాంతం ఎవడూ హీరోగా వుండలేదు
కవి ఒక్కడే ఎప్పడూ హీరో కావాలనుకోడు
కవి ఒక్కడే మనిషిగా జీవిస్తాడు
కవి ఒక్కడే మనిషిగా మరణిస్తాడు
కవి ఒక్కడే మరణానంతరం కూడా జీవిస్తాడు

- సౌభాగ్య, 9848157902