సాహితి

కథల మంచిచెడ్డలు (శ్రీవిరించీయం 14)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణంగా పుస్తకాలు, పత్రికలు చదివే వాళ్లందరికీ ‘కథలు’ చదవడంలో అభిరుచి, అభినయం వుంటుంది. ఈ చదవడంలో కొన్ని యిబ్బందులు కూడా వున్నాయని అందరికీ అందుబాటులో వున్న విషయమే. ఒక్కో కథ చదివిన తరువాత ‘ఎందుకు నా సమయం యిట్లా వృధాజేస్తున్నాను, యింతకన్నా నోరు మూసుకుని పడుకుని వుంటే విశ్రాంతి అయినా దక్కేదికదా!’ అనిపిస్తుంది.
ఒక్కో కథ చదవడం పూర్తయిన తరువాత కూడా అందులోని విషయాల్ని వస్తువు మన మనసులో గిరగిర తిరుగాడుతూ వుంటుంది. మనలో అనేక ఆలోచనలు, అవగాహనలు తీసుకువస్తుంది.
మొదటిదాన్ని చెడ్డ కథ (చెడిపోయిన కథ) అంటాం. రెండో దానిని ‘మంచి కథ’ అంటాం. చెడ్డయినా, మంచయినా వాటిలోనూ తరతమ భేదాలు వున్నాయి. దేన్ని తయారుచేయటానికయినా రచయిత అన్నవాడు కొంత పరిశ్రమ, సమయం ఖర్చుచేశాడు.
అట్లాంటప్పుడు ‘మంచి కథే’ రాయవచ్చునుకదా, చదువరుల ప్రాణాలు కడబట్టేట్లు కోరికూడిని చెడ్డ కథలు రాయడం ఎందుకు? - అని ప్రశ్న వేసుకుంటాడు, కాస్త, ఆలోచన వున్న పాఠకుడు.
మంచి కథ ఎట్లా వుంటుందో తనలోతాను, తనతో తాను ఆలోచించుకోవడం ప్రారంభిస్తాడు.
అతనికి ముందుగా తోచేది ‘కథలో వస్తువు వుండాలి. విషయం సామాన్య పాఠకుడి మనసుకు వెంటనే అంటేట్లుగా వుండాలి-’ అని అనిపిస్తుంది.
తరువాత అనిపించే విషయం ‘మంచయినా చెడయినా అయిదు లేకపోతే పది పదిహేను నిమిషాలలో తేలిపోవాలి; ఊరికే సాగదీసుకుంటూ పోతే ఒకటే చికాకు’ అనిపిస్తుంది- అనుకుంటాడు.
‘కథలో ఎక్కువ పాత్రలు వుంటే మరీ చికాకు. ముగ్గురు నలుగురు కన్నా ఎక్కువగా వుంటే- వాళ్ల పేర్లు, చర్యలు కనిపెట్టుకోవడం కష్టం. ఎవరి డైలాగులు ????????? పడే అవకాశం వుంది’ అని తోస్తుంది అతనికి.
కథలో అనవసరమయిన అక్షరాలు, మాటలు వుండకుండా వుంటే మంచిది. విషయాన్ని క్లుప్తంగా, సూటిగా, డొంక తిరుగుడు లేకుండా చెప్పుకుంటూపోతే చదివే వాడికి హాయి. రాసిన వాడికి శ్రమ తక్కువ. అలాగే ‘వస్తువు’లో యేమి సమస్య తెచ్చిపెట్టాడు. దానిని ఎలా పరిష్కారం చేశాడు. ఏమన్నా ఉపాయం సూచించాడా లేక పాఠకుడిని అరణ్యంగా దిక్కుతోచని వాడుగా చదివేశాడా?
‘పరిష్కారాలు రచయిత చెప్పడు. పాఠకుడినే ఆలోచింపచేసి, ముగింపు ఊహించుకునేట్లు చేస్తాడు. అదే ఉత్తమ పద్ధతి.
‘సమాజంలో వున్న అసమానత, అసమగ్రత ఎత్తిచూపితే చాలు.. దానిని వాక్యాలవారీ వర్ణించుకుంటూ పోనక్కర్లేదు. అందుకు కారణమైన వాళ్లను నరికెయ్యనక్కర్లేదు’- అని తదుపరి తన ఊహలు సాగించుకుంటాడు.
‘మనిషిని చెట్టుమీదకి ఎక్కించు-
‘వాడి మీద రాళ్లు రువ్వు.’
‘వాడిని చివరకు కులాసాగా కిందికి దింపు.’
- యిదీ కథలో చదువరి కోరుకునేది.
రాళ్లు రువ్వడం అంటే అతనికి వున్న సమస్యలను ఏకరువు పెట్టడం.
ఉద్యోగం లేదు, ప్రియురాలు కలిసి రావడం లేదు. ఆరోగ్యం యిబ్బందిగా వుంది... యిటువంటివి.
ఇతరుల సహాయంతో సహకారంతో రుూ సమస్యలు మనిషి అన్నవాడు తొలగదోసుకుని, ‘అతి’క్రమించి- మళ్లీ మామూలు మనిషిగా మనుగడ సాగిస్తాడు.
సమస్యలను అర్థం చేసుకోవడంలో, అవగాహన పెంచుకోవడంలో కొత్త రకం వివేకాన్ని సంపాదించుకుంటాడు మనిషి.
పరిస్థితులన్నీ ఎవరో పగవాళ్లు తనమీద రుద్దినవి గాదు, తను చేసిన పనులకు ఫలితంగా ఎదురవుతున్నవేనని తెలియపరుచుకుంటాడు. అపోహలు, దురూహలు వుంటే త్వరత్వరగా తొలగిపోతాయి. తన ఆలోచనలలోనే తప్పుదారులుంటే అవి సరళంగా తయారవుతాయి. జీవితం ఎంత వేగంగా నడుస్తుందో- కథ కూడా అంతే పదునుగా, త్వరితంగా నడవాలి.
పరుగులు తీయనక్కర్లేదు నిలుచున్న చోటనే నీళ్లు తాగితే చాలు. పరుగు తీసి బోర్లాపడడం, బాధలనుండి బయటపడడం కథావస్తువు అయితే అది వేరే మాట.
జీవితం సరళరేఖ లాగ జరిగిపోతే కథే కాదు.
గాలి- వాన వస్తే కథే లేదని పాత సామెత.
రుూ గాలితోనే, వానతోనే కథ ప్రారంభం అవుతుందనేది కొత్త సామెత.
దానిలోనే పాఠకుడిని ముంచెత్తి తరువాత తరింపచేస్తుంది.