సాహితి

కథలలో పాత్రలు.. కాలక్షేపాలు ( శ్రీవిరించీయం 15)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథకు మొదలు మధ్య చివరో వుండాలి. అయితే యివి రుూ వరసలోనే వుండవలసిన అవసరం లేదు. కథ చివరలోనే మొదలయి కథనం తరవాత వివరించడం జరగవచ్చును. మధ్యలో మొదలుపెట్టి పూర్వాపరాలు క్రమంగా- సక్రమంగా జరగవచ్చును. మధ్యలో మొదలుపెట్టి పూర్వాపరాలు - సక్రమంగా చెప్పవచ్చును. వస్తువు (విషయం ఆసక్తికరంగా వుంటే ఎలా చెప్పినా దోషం లేకుండా చదువుకుంటాడు పాఠకుడు.
కొన్ని కథలు కేవలం కాలక్షేపంకోసమే పనికి వస్తాయి. వాటిలో నిలువచేసుకోవలసిన విషయం యేమీ వుండదన్నమాట. కథంతా కులాసాగా నడిచిపోతుంది. కాలక్షేపం కాకుండా, నాలుగు కాలాలపాటు నిలిచేట్లు వుండే కథలు వుంటాయి. జీవితంలో వున్న శాశ్వత విలువలు, వాటి పరిరక్షణ, అవి రక్షించకపోతే వచ్చే ప్రమాదాలు చెప్పే కథలు రుూ కోవకు చెందుతాయి. సాహిత్య ప్రమాణాలు చక్కగా వున్న కథలకు యెక్కువ చెలామణి వుంటుంది. సాహిత్యం అంటేనే జనులకు ‘హితం’ చెప్పేది అని అర్ధం కదా, సుమతీ శతకం వ్రాసిన రచయిత యేమన్నాడో తెలుసుకోవడం యిక్కడ అప్రస్తుతం కాదు. ‘శ్రీరాముని దయచేతను/ ఆ రూఢిగ సకల జనులు ఔరాయనగా/ ధారాళమైన నీతులు/ నోరూరగ చవులు పుట్ట నుడివెద సుమతీ అన్నాడు. ఇందులోనే కథలకు కావలసిన ముడికట్టు రాళ్లు నిక్షిప్తపరిచాడు. ఒకటి- జనం ఆ కథను ఔరా అనాలి! అంటే వాళ్లు ఆశ్చర్యపోవాలి. ఇట్లా కూడా జరుగుతుంది, అని సహేతుకంగా నమ్మేట్లుగా వుండాలి.
తెప్ట్ విషయం ‘నీతి’ దాయకంగా వుండాలి అనేది రెండో అంశం. రచయిత ముందుగా ‘ఇష్టదేవతా ప్రార్థన’ చేసుకుంటున్నాను. ఏ పనికయినా దైవానుగ్రహం వుండాలి. అందుకని ఆ పనిచేసే ముందు దైవాన్ని తలుచుకోవడం ఆయన కృపా కటాక్షాలకోసం ప్రాధేయపడడం తప్పనిసరి. దైవానుగ్రహం ఒక్కటే చాలదు. దానికి తోడుగా ‘పురుష ప్రయత్నం’ కూడా వుండాలి. గాలిలో దీపం పెట్టి దేవుడనే మహిమ అంటే లాభం లేదు. గాలికి దీపం ఆరిపోకుండా దానికి రక్షకవచం లాంటి అద్దపు చినీలు తగిలించా. మన ప్రయత్నం అంతా మనం చేసి తరువాత భగవంతుడిని రక్షణ యివ్వమని అడగడం, ఆయన యివ్వడం వ్యవహారికమయిన అలవాటు. మన ప్రయత్న లోపం వున్న, దానిని సరిగా గమనించకుండా, ‘దైవానుగ్రహం లేదు, యేం చేస్తాం?’ అని ఊరట పొందడం కూడా అలవాటు అయిపోయిన వ్యవహారమే. రెండూ సమకూడినప్పుడు - పని సంపూర్ణంగా చక్కగా జరిగితే అది మన ప్రభావమేనని మెడలో ఉత్తరీయం వేసుకుని ఊరంతా ఊరేగవచ్చు. చొక్కా కాలరు పైకెత్తుకుని ఠీవిగా నడవవచ్చు. అదీ సామాన్య జనం పద్ధతి.
కథలో పాత్రలు ఎలాంటివి ఎన్నుకుంటే మంచిది- అనేది ఆలోచించవలసిన విషయమే. చదువరికి అలవాటు అయిన తరహా పాత్రలు అయితే మంచిది. కనీసం అతని ఊహకు అందే పాత్రలయినా అయి వుండాలి.
పూర్వం రాజులు, మంత్రుల కథలు ఎక్కువగా చెలామణి అవుతూ వుండేవి. అలాగే దొంగల కథలు కూడా. దొంగలు ఎంత చాకచక్యంగా- రెండో చేతికి తెలియకుండా- మూడో కంటి వాడికి కనబడకుండా దొంగతనం చేసి బయటపడిపోతారో యుక్తయుక్తంగా చెప్పిన కథలు అనేకం వున్నాయి. ‘చోరకళ’ మనిషికి కావలసిన అరవయి నాలుగు కళలలో ఒకటి అయి వుండడమే కాక, దొంగతనం ‘చాకచక్యం’గా చేయగలగడం చదువరికి/ వినే వానికి ఆసక్తిదాయకంగా వుంటుంది.
అయితే యిప్పుడు అలాంటి కథలకంటే- బట్టలు కుట్టే వాళ్లు, బట్టలు ఉతికే వాళ్లు కథలలో పాత్రలుగా వుంటే దిగువ తరగతి సంపాదన పరుల జీవితాలను గురించి చెప్పగలగటానికి అనుకూలత ఎక్కువ వుంటుంది. ఆటోరిక్షా నడిపే అతను, కిరాణా దుకాణంలో పనిచేసే మనిషి, తాగితే తప్ప కాయకష్టం చేయలేని కార్మికుడు... యిలాంటివాళ్లు పాత్రలయితే మామూలు జీవితం ఎలా నడుస్తూ వుందో చెప్పుకోవచ్చు. మల్టినేషనల్ కంపెనీలో డైరెక్టర్, కాలేజి ప్రిన్సిపాల్, ముఖ్యమంత్రిగా ఎ.డి.సి- పాత్రలు అయితే చదువరికి అంత పరిచయం అయిన వాతావరణం సమకూడదు. అంటే, వాళ్లకు ‘కథలు’ వుండవని కాదు. నిజానికి వాళ్లకే మామూలు మనుషులకంటె ఎక్కువగా ‘చెప్పుకోదగిన కథలు’ వుంటాయి. కాని చెప్పడంతో- కథాకథనంలో వాతావరణం సృష్టించటానికి, చదువరికి దగ్గరకు తీసుకురావడానికి ఎక్కువ శ్రమపడవలసి వస్తుంది. జన సామామ్యంలో సాధారణంగా కలిసిపోయే మనుషులయితే, కథలలో పాత్రలుగా చక్కగా యిమిడిపోతారు.

- శ్రీవిరించి, ఫోన్ : 09444963584