సాహితి

నన్ను ప్రవహించనీయండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను ప్రవాహాన్ని,
నా దారిన నన్ను ప్రవహించనీయండి..
నాకో కొత్త పేరు, చిరునామా ఇవ్వకండి!

నన్ను వెనక్కి పిలవకండి,
ఫలానాచోట, ఫలానా సందర్భంలో
ఏం జరిగిందో చెప్పమని అడక్కండి..
నన్ను సాక్షిని చేయకండి, నన్నాపకండి!

నా ప్రయాణం ఎంతో ఉంది..
ప్రతి మలుపులోనూ కొత్తదనం,
ఊపిరికి అందని ఉత్కంఠ
ఆహ్వానించాల్సిన వసంతాలు అనేకం
కొత్త భాష, కొత్త వ్యక్తీకరణ
నాదైన నడక సంతరించుకోవాలి!

ముఖ్యంగా-
తెల్లవారు జామునే మేల్కొని
తమ మధుర స్వరాలతో ప్రపంచాన్ని తట్టి లేపే
పక్షుల్లో పక్షినై, పాటనై, నాదాన్నై
రెక్కలు విప్పాలని!

నేను ప్రవాహాన్ని
నాదారిన నన్ను ప్రవహించనీయండి!

- ఎం.కె.సుగమ్‌బాబు, 8096615202