సాహితి

సరికొత్త వేదన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ అడవి కోడిపుంజు కూతలు
ఇంకా నీ దరికి చేరలేదా?
రోడ్డుకు అడ్డంగా కుందేలు గంతులు వేస్తోంది
వంతెన కింద నది పరవళ్ళు తొక్కుతోంది
ఈ నీలాకాశం నీడలో
నీ నవ్వుల వెలుగును చూడటం సంబరంగా ఉంది
ఈ తొలి వేకువ సమయాన, వేకువ వేళన
ఈ కొత్త ఉదయాన్ని
నీతో కలిసి చూడటం సమ్మోహనంగా ఉంది.

ఆ మోటారు వాహనం సవ్వడి
నీకు వినిపించడం లేదా?
పల్లెకు దారితీసే రోడ్డుకు ఒకట్రెండు మైళ్ళ దూరాన
ఆ వాహనం వయ్యారంగా రావడం నిన్నాకర్షించలేదా?
అయతేనేం, ఈ నీలాకాశం ఛాయలో
నీ నవ్వుల మెరుపును చూడటం ఆనందంగా ఉంది
ఈ కొత్త ఉదయాన, ఉదయ కిరణాలలోన
ఈ తొలి వేకువను
నీ కళ్ళలోంచి చూడటం మహదానందంగా ఉంది...

ఎప్పుడూ సుదీర్ఘంగా నిట్టూర్చే రాత్రి
ఇప్పుడేమో క్షణాల్లో కరిగిపోయంది
నువ్వు నాతో ఉన్న ప్రతిసారీ జరిగే సహజ అద్భుతం కదా ఇది

ఇంకా నీకు సూర్యుడి ఎండ పొడ తగలలేదా?
ఊరి పక్కన కాలువ గట్టు అంతటా
Ground hog సూఛనలే
ఖచ్చితంగా నా కలలన్నీ నిజమయ్యే రోజు ఇదే కదా
అందుకే, ఈ నీలాకాశం దిగువన
సజీవంగా ఉన్నందుకు సంతోషంగా ఉంది
ఈ నవకాంతి సమయాన, నవ్య వెలుగులలోన
ఈ నవనవోనే్మష ఉదయాన్ని
నీతో పంచుకోవడం వేడుకలా ఉంది.

ఈ నీలాకాశం కౌగిట్లో
ఇంకా సచేతనంగా ఉన్నందుకు గొప్పగా అనిపిస్తోంది
ఈ తొలి కిరణాల సమయాన, తెలి కాంతులలోన
ఈ తొలి పొద్దును
నీతో కలిసి పంచుకోవడం మహా గొప్పగా ఉంది
ఈ కొత్త పొద్దున...

మూలం: బాబ్ డిలాన్ 'New Morning'
స్వేఛ్ఛానువాదం : మామిడి హరికృష్ణ
9908844222

మామిడి హరికృష్ణ 9908844222