సాహితి

కళ్లలో ఆనందం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పున్నమి వెనె్నల కురిసినట్టుగా
ఆనంద డోలికల్లో
తేలియాడే మనిషి కళ్లు
కాంతులీనుతాయి.
అవధులు దాటి
హృదయ పుటంచులనుంచి
పొంగి అలుగుబారిన
అవర్ణనీయ మనోల్లాసం
మనిషినే కాదు
ఎదుటి వాళ్లని సైతం
పరవశం చేస్తోంది.
క్రౌర్యం కుత్సిత చింతన
ఇతరుల మేలోర్వని
అసూయాపరుల కళ్లలో
కనిపించే ఆనందం మాటున
తరచి తరచి చూస్తే
నల్లటి జీరల తెరలు గోచరిస్తాయి
ఆనందమైనా అభినందనైనా
మనసు లోతుల నుంచి వస్తేనే
కళ్లలో ప్రతిఫలించి
తళతళ మెరుపుల్ని వెదజల్లుతోంది
కళ్ల భాష కఠినతరంగాదు
మనసుంటే మార్గముంటుంది
అది మనుషులమధ్య తగ్గిస్తోంది దూరం
సన్నిహితమై
సమతా మమతల పందిళ్లు వేస్తోంది
అప్పుడు పంచుకున్న మధుర క్షణాలు
కళ్లనుంచి రాలుస్తాయి, ఆనంద బాష్పాలు
మదినిండా పలుకుతాయి అనురాగ రాగాలు...

- డా. దామెర రాములు 09866422494