సాహితి

పడమటి గాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాయువు సహిత ‘వాయవ్యం’
పడమటి వాలులోనే వున్నందుకేమో?
పడమటి గాలికి ప్రభావమెక్కువ!
అందుకే గాలి విపరీతంగా వీస్తుంది
మూసిన కిటికీలను - తలుపులను సైతం
తోసుకుని మరీ ప్రవేశిస్తుంది!
ఒక్క గాలి మాత్రమే ప్రవేశిస్తే పరవాలేదు
కాని దానితోపాటు
పాశ్చాత్యపు పైత్యాలనన్నీ పట్టుకొచ్చి
మన నట్టింట్లో నాట్యం చేయస్తోంది!
యువకులనే గాక యువతులకు గూడ
తొడల సోకులు తొంగిచూసేలా
చిట్టిపొట్టి నిక్కర్లనే వేయస్తోంది!
‘టీనేజి’ని ‘మేనేజి’ చేయలేని
‘టీషర్టు’ల్ని ధరింపజేస్తోంది!
ప్రియమైన ఇడ్లీ - ఉప్మాలకు స్వస్తి చెప్పించి
‘పిజ్జా-బర్గర్ల’ను తినిపిస్తోంది!
వేస్ట్ ఫాస్ట్‌ఫుడ్స్‌ను
మోస్ట్‌వాంటెడ్ చేయస్తోంది
అంతటితో ఆగిందా?
ఆధ్యాత్మిక-వైజ్ఞానిక పరిజ్ఞానంలోనూ
పాశ్చాత్య ఆధిక్యతనే బలపరుస్తోంది!
కాని, అమెరికా అత్యాధునిక వైజ్ఞానిక
‘నాసా’కూడ తమ పరిశోధనలో
ఆదిత్యుని చుట్టూ ఓంకార ధ్వని
ఆదినాదంగా మోగుతున్నట్లు విని
కళ్లారా కని
సూర్యగోళ సూక్ష్మ రహస్యాల్ని
మన మహర్షుల వేదోక్తుల్ని
సత్య సంకేతాలుగా గుర్తించాలని
తు.చ. తప్పక పాటించాలని
తూర్పు గాలినీ ఆస్వాదించాలని ఆశిస్తోంది!

పాఠశాలల్లో భగవద్గీతను ‘ఐరోపా’
పాఠ్యాంశంగా చేర్చి ఆదరిస్తోంది!
అయదున్నర వేల
సంవత్సరాల క్రితమే
మన వ్యాసర్షి వర్ణించిన
ఖగోళ పరిజ్ఞానాన్ని
భూగోళ పరిభ్రమణాన్ని
నిమిషం కూడ తేడా లేని
నక్షత్ర చలనాల్ని
గమనించి నివ్వెరపోయ
చేతులు జోడిస్తోంది!

- డా. వడ్డేపల్లి కృష్ణ