సాహితి

వూటుకూరి సాహితీ సౌరభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు పరిమళం
పేజీలు: 74 వెల: రూ.75/-
ప్రతులకు :
వూటుకూరి కృపారాణి;
12/29/1, అశోక్‌నగర్,
కొయ్యలగూడెం, ప.గో.జిల్లా- 534312
అన్ని పుస్తకాల షాపుల్లోనూ...

అజంత భాష తెలుగు: ‘‘తెలుగు పరిమళం’’ నిజంగానే సౌకుమార్య భావనలకు, జాతి సంస్కృతికి ఒక దిక్సూచిగా డా.వూటుకూరి వరప్రసాద్ రచనలో వి(సు)స్పష్టమైంది. అందుకే భావాల భాష కవిత్వం- తరాల వారసత్వం సంపదైంది. జాతిని- ఔన్నత్యాన్ని, చారిత్రక సంఘటనల్ని కాలంలోంచి ఆవిష్కరించిన ప్రయోజన ప్రయోగశీలతల్నిచ్చింది. దానినే ఈ కవిత అతి నేర్పుగా సుబోధకం చేసారు.
భాష విత్తనం లాంటిది/ దానికి మొలకెత్తడమే కాని/ చావటం తెలియదు- అదీ జనం భాషను జీవద్భాషగా చేసారు. ఇలా అభివర్ణించిన తీరు హర్షణీయం. ఒక రకంగా భాష జనం నాలుకల మీద నడయాడాలన్న దృక్పథమే కదా! ఈ విషయ ప్రాధాన్యాలు- ప్రపంచంలోని 10 కోట్ల మంది తెలుగువారికి కరతలామలకం చేయడమే లక్ష్యం. దీని ఉద్దేశ్యం కావచ్చును. అలాగే సమాజ చోదకత్వం, కవితాత్మక ఆలోచనలు సృజనాత్మకం చేసారు.
ముఖ్యంగా ఏ భాషా తన జాతీయతను కోల్పోకూడదు. సంస్కృతి నిలబడడానికి భాషే జీవగఱ్ఱ. ఒక ప్రధాన వాహిక అన్న నమ్మిక, పూనికగా ప్రయత్నం చేసారు. 1863-1940ల గ్రాంధిక తెలుగు భాషా- గంగను, వ్యావహారిక భాషగా మార్చిన ఆంధ్ర రత్నత్రయాలు ‘‘కందుకూరి, గిడుగు, గురజాడల్ని వారి రచనల్ని భావప్రసార మాధ్యమాల లక్షణంగా వివరించారు. ఒక నదిగా ఎన్ని ఒడిదుడుకులు ప్రవాహం మలుపులు ఉంటుంటాయో ఆంధ్రజాతికి ఉనికిగా మారింది. అలాగే సాగిందన్న విషయాల్ని ఉదహరించారు. ఒక రకంగా చెప్పాలంటే కవిత్రయ కావ్యఝరయ్యింది. పోతన, శ్రీనాథుల్నించి, కాకతీయుల పరిపాలనా వైభవం, కవిపోషణలు- సంప్రదాయ బంధాలనుంచి ఆధునిక కవితా వైభవాలకు కొత్త తెన్నులయినాయి. విధి విధానాల్నించి ప్రగతిశీలత వరకూ విస్తరింపచేసారు.
‘‘ఆంధ్ర త్వయాంధ్ర భాషాచ, బహుజన్మ తపః ఫలం’’
అన్న ఆర్యోక్తిని నిజ సాకారాక్షరాలుగా మలిచారు.
జాతి మనుగడ కోసం/ నీతి తలగడ చేసి/
యుగయుగాల నిశ్శబ్దాన్ని/ బద్దలు చేస్తు...
కురుపాండవ సమరంలో... రామాయణ గాథల్లో...
పురాణాలు స్మృతుల్లోనూ... ఐతరేయ మతంల్లోనూ...
- అంటూ యమునా తీరం ఆరంభంనుండి కృష్ణాతీరం వరకూ విస్తరించిన అంధకులు ‘‘ఆంధ్ర’’కులైన ఖ్యాతిని తెల్పారు. యింకొంచం సంస్కృతీ వాహికలైన నదీ నాగరికతల విస్తరణాంశాల్ని, సారస్వత కళాపరిమళాలు ఎలా కథాచరితాలుగా సుధామృతాలయ్యాయో గ్రాహ్యం చేసారు. ఆదికవి నన్నపార్యుని- నానారుచిరార్థసూక్తిని దరిమిలా రస భావామృత సరితలుగా, రసనాగ్రాల రమణీయతల్ని కవితా సీమల్లోకి విహరింపచేయడం అభినందనీయం.
యిలా మైళ్ళకొలది నడిచిన చరిత్రకు అతిధేయులు ఆంగ్లేయులు చేసిన సేవాభావాన్ని రచయిత పొందుపరిచారు. ఈ విషయంలో ఎ.ఒ.కాంబెల్‌ను భాషాశాస్తజ్రీవిగా కొనియాడారు.
అలాగే రమ్యభావనా లోక వసంతుడు రాయప్రోలు, ఊహల్లో ఉదయించిన ప్రణయైక రాశి ఊర్వశి కృష్ణశాస్ర్తీని, రసానంద హర్షిణి ఆనందవర్షిణి నండూరివారి ‘‘ఎంకి’’ని పడతి కినె్నరసాని పరుగంటి నడకల విశ్వనాథని గుర్తుకుతేవడం, చిత్ర కళాజగత్తుకు బాపిరాజును నిత్యస్మరణీయులుగా చేయడం కృషివల్లనే సాధ్యమయ్యింది. మనం రచయిత అభిప్రాయాల్ని పరిగణనల్లోకి తీసుకున్నప్పుడు- ‘‘కులాభిమానం పెరిగినంత ఎత్తుగా భాషాస్పృహ పెరగకపోవటం ఆలోచింపచేస్తుంది.
‘‘రుచి మధుర శ్రుతులుగా సాగింది నా భాష
జనశ్రుతులు పల్లవిగా అనుభూతి అనుపల్లవిగా’’
అంటూన్న చరణాలు సహస్ర భావైక్యతా కిరణాలై ప్రసరిస్తూ లక్షల గవాక్షాల్లో వెలుగు పుల్కల్ని నింపుతాయనడంలో అతిశయోక్తి లేదు. తెలుగు పరిమళంలోని అనేక పార్శ్వాలు, పదాలైనాయి. మీదుమిక్కిలి సమాజపు కాన్వాసులోని అక్షరాల ఆర్తగీతాల్ని పద చిత్రాలుగా భావనాబలం, దృశ్యబద్ధం చేసారు.
కవే అన్నట్లుగా // కుల అస్తిత్వాలు వృత్తి అస్తిత్వాలు / భాషా విస్తృతికి బాటలువేసాయి / బి.సి. వాదంలో వృత్తి చైతన్యం// మైనార్టీవాదంలో వ్యక్తిదైన్యత/ జీవన చిత్రాలుగా రూపుదిద్దుకున్నాయి// పూర్తిగా సమకాలీన అంశాల పట్ల మేల్కొన్న కవి కన్పిస్తాడు. ఒక కొత్త చూపును ఆవిష్కరించినట్లుగా- తెలుగులోని వృత్తిపదాల సంకలనాలు, వ్యక్తి భావచైతన్యాలు, బహుజనుల అనుభవాల భావనా బాధావర్ణ చిత్రాలుగాను గుర్తుచేయడం జరిగింది. నిజంగానే ఇది కవికున్న మేధావితనం, దార్శనిక పధంగా కన్పడ్తుంది. అసలు కవిలోని సదాశయం, భాషాప్రియత్వం మొలకెత్తాలనటం ఉన్నంతగా సంస్కారానికి నిదర్శనం. //వేల వేల వర్ణాలయినా/ నా భాషావరణం ముందు/ సాష్టంగ పడవలసిందే// అన్న సూక్తి భాషాప్రియుల్ని మన తెలుగుని వెలిగించేందుకు తెలుగువారి జీవనయానం సాంస్కృతిక మధురిమలుగా మార్చినవైనం తెల్పారు.
ఇక ఉపసంహారంలో// మన మాటలు పూల తోటలై
జీవనోత్సవాన్ని రంగుల్లో ప్రదర్శిద్దాం// జీవితోత్సాహాన్ని భాషలో ప్రకటిద్దాం// యిలా అందరి మనసుల్లో ప్రశాంత వసంతోదయాల్ని- ఈ తెలుగు పరిమళాల గుబాళింపుల్ని- మనందరి మధుకలశాల్లో నిక్షిప్తం చేసుకుందాం. రచయిత కృషిని అభినందిద్దాం.

- వి.యస్.ఆర్.యస్.సోమయాజులు