సాహితి

రోడ్డు మధ్యలో ఆడకూతురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె
రోడ్డు మధ్యలో
జడుసుకుంటూ బతికే జనం మధ్యలో
అర్ధనగ్నంగా...
అడ్డొచ్చిన గుడ్డలను పీకేస్తూ
గౌరవం ముసుగేసుకున్న మనుషుల
మీదకు విసిరేస్తోంది
విలాసంగా వికారాలను
దాచుకున్న మగాళ్లను కడిగేస్తోంది
ఆచ్ఛాదన లేని ఆ దేహం
అందరి అమ్మలాగే ఉంది

అది రాయైనా, రప్పైనా
రాటుదేలిన మాటైనా
పరికించి చూసే పురుషుల మీదకు
విసురుతూనే ఉంది

ఎవడో...
ప్రేమించి, నమ్మించి,
కామంతో తూకం వేసి
తెల తెల్లవారుజామున జారుకుని
దొరలా ఈ సభ్య సమాజంలో కలిసిపోయాడు

ఆ ఆడకూతురు
ఎండుటాకులా మారిన యవ్వనానికి
చిరునామాను తిరస్కరించింది
ఎండలో, వానలో
ఎదురొచ్చిన ధూళిలో
ఎగురుతూ వచ్చి నడిరోడ్డులో నిలబడింది

ఇప్పుడామె వీరవనిత
నిస్సిగ్గుగా చూసీ చూడనట్టుగా జారుకుంటున్న
జనాల సిగ్గులేనితనంపై
సూటిగా వేస్తున్న చురక

- బసు పోతన, 9440878247