సాహితి

సంఘటనల నుండి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశే్లషించడానికేం మిగిలింది
సామాన్యమైందేదీ ఉండదిక్కడ
బియ్యపు గింజంత సహజంగా
అన్నీ జరిగిపోతూనే వుంటాయి
స్మృతులు పరచిన తివాచీల్లా ఉండిపోతాయి
మళ్ళీ రణక్షేత్రాలు రగులుతాయి
జనన మరణాలు సహజాతాలవుతాయి
ఆరని దిగులుతో
ఆరబోతల తడి అంటుకుంటుంది
అస్తిత్వ ప్రభావాలయాలు
ఒంటరితనాన్ని పులుముకుంటాయి
అనంత దూరాలు ఎప్పటికప్పుడే
కలుస్తూ విడిపోతూనే వుంటాయి
మైలురాళ్లు నిలబడి మళ్ళీ
సరిహద్దుల్ని వెలిగిస్తుంటాయి
వొదగడం ఎదగడం దిగబడడం మామూలైంది
పేరుకుపోయిన సంవేదనల్ని ఊడ్చేస్తే
ఒకానొక శబ్ద సంభాషణ విన్పిస్తుంది
మన ఆనవాళ్ళు ఎరుకవుతాయి
వొంపుకున్న దుఃఖపు తడి తగులుతుంది
ఘనీభవించడం కాదు
ద్రవీభవించాలనిపిస్తుంది
సామూహిక క్రియలోకి
అడుగిడాలనిపిస్తుంది
నాటిన విత్తనంలా మొలకెత్తాలనిపిస్తుంది
సూర్యబింబమై వాలాలనిపిస్తుంది
ఆశతో ఆశయాల్ని ఎగరేయాలనిపిస్తుంది
హృదయపు కవాటాల్ని తెరవాలనిపిస్తుంది
మనో స్వప్నసీమల్ని గెలిచి
ఉదయాస్తమయాల్లోనూ వెలగాలనిపిస్తుంది