సాహితి

ఇల్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరి పనులమీద వాళ్ళం
ఇల్లు వదలిపోతామా
అది ఒంటరి మేఘమవుతుంది!
దూరతీరాలకు
పిల్లలు రెక్కలొచ్చి ఎగిరిపోతున్నప్పుడు
మాతోపాటు
సత్యంగా దుఃఖించింది
మా ఇల్లొక్కటే!
ఎన్ని ఖరీదైన వస్తువుల్తో నింపినా
ఇంటికింత తృప్తి ఉండదు
అది మనుషుల్ని కోరుకుంటది!
ఇల్లంతా
పండగకో పబ్బానికో
బంధు జనంతో నిండినప్పుడు చూడాలి
జెండా ఎగరేసిన ఎర్రకోటే!
అన్ని గోడలకూ చెవులున్నట్లే
మా ఇంటి గోడలకూ చెవులున్నాయి
నోరొక్కటే లేదు
సుఖ దుఃఖాలు పంచుకోవడానికి!
సాయంకాలానికి
ఒక్కొక్కరుగా ఇంటికొస్తుంటే
చూడాలి దాని తీరు
దాచుకున్న సంబురమే!
అలిసిన దేహాలతో
రాత్రిని కప్పుకొని
మేమంతా సేద తీరుతుంటే
అదొక్కటే
ఎల్‌ఓసి దగ్గర కాపలా కాసే సెంట్రవుతుంది!
మనుషులు లేని ఇల్లు
ఎంత విశాలమున్నా
నీళ్ళు లేని గండిపేట చెరువే!
ఇల్లులేని మనిషి
ఎంతటి ఘనుడైనా
గూడులేని పక్షే!!

- కోట్ల వెంకటేశ్వరరెడ్డి 9440233261