సాహితి

తుపాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్ని కవితలూ మృత్యువువే
ఇదొక్కటే జీవితానిది!

అన్ని కవితలూ నా స్వంతం
ఇదొక్కటి మాత్రమే నీది!

అన్ని కవితలూ ఆగిపోయనవి
కోర్కెలు గడ్డకట్టి పెదాలపై నిలిచినవి
వర్షాకాలపు వరదలకు వీధులు నిండిపోయ
‘మ్యాన్‌హోల్స్’ తెరుచుకుని
‘సీవేజ్’ - మురికి కాలువలు హోరెత్తి
రక్తమోడుతున్న శరీరాలు
కుప్పలు తెప్పలుగా వెనక్కి కొట్టుకుపోతూ
వంతెనలు కూలిపోతూ ఉంటే...

అన్ని కవితలూ నగరానివే
ఇదొక్కటే దేశానిది!

ఇది ఒక ప్రళయ సముద్రం
దీని బాధలేమిటో ఎవరికీ ఇంకా తెలియదు
ఎవరో ఒకే ఒక్కడు నింపాదిగా
దాని సంగతి తెలుసుకుందామని
కెరటాల్లోకి నడిచివెళ్లాడు -

లేచిపడే దుమ్మూ, ఇసుకల మధ్య
నవ్వుతూ కేరింతలు కొడుతున్న జనం
రాబోయే తుపానుల గూర్చి చర్చిస్తున్నారు

అన్ని కవితలూ గంగానదివే
ఇదొక్కటే యమునది!
**
ఈ యేడాది జ్ఞానపీఠ్‌కు ఎన్నికైన
బెంగాలీ కవి శంఖాఘోష్ కవిత