సాహితి

కలయికంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలోచన ఒంటరిదే అంతర్లయా ఒంటరిదే
ఒంటరి వానచుక్కలే జతకట్టి
నేలనూ గాలినీ తడిపినట్టు
విత్తనం ఆత్మతో సంభాషించి
అంకురానికి ఆయువు పోసినట్టు
ఆకుపచ్చ నీడై అలసటకు ఓదార్పునిచ్చినట్టు
ఒక్కొక్క అక్షరమూ అల్లుకొని వాక్యమై
ఊహకు ఊపిరిపోస్తుంది.

మనుషులుగా చలించి
మనసులుగా ద్రవించిపోతం
కలయికల తియ్యదనాలనో
కన్నీళ్ళ ఉప్పదనాలనో
కలిసి కలబోసుకుంటం
ప్రమిదలల్ల వొత్తులు వెలిగించుకున్నట్టు
గుండెల్లో ఊహలను వెలిగించుకొని కలుద్దాం
ప్రాణం పోసుకున్న
ఓ నాలుగు పద్యాలను వెంటేసుకొని
అలుగులు దుంకినట్టు కలుద్దాం

కలయికంటే ఒకరినుండి
ఒకరిలోకి ప్రవహించడం
చూపుకి పదునుపెట్టి లోచూపై వికసించడం
మాటగా మొలకెత్తి తోటై పరిమళించడం
కలయికంటే కాలాన్ని బతికించడం.

- వఝల శివకుమార్