సాహితి

కథలలో అనుభూతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి కథ ఒక మనిషి భౌతిక మానసిక స్థితిగతులను, వాటిని యెదుర్కుంటున్నప్పుడు అతడు పడుతున్న అనుభూతులను అక్షరబద్ధం చేస్తుంది. వ్యక్తిగతమయిన రుూ అనుభూతులన్నీ కలగలిపినప్పుడు అదే ఆ సమాజంయొక్క స్వరూప స్వభావంగా రూపుకట్టుకుంటుంది. సమాజానికి వ్యక్తి మూలం అయితే, వ్యక్తికి సమాజమే మూలం. వ్యక్తి స్తంభం లాగ నిలిచి సమాజాన్ని దివ్యభవనం లాగ చూపుతాడు. స్థలం-మనుషులు - కాలం మానసికస్థితి రుూ నాలుగు స్తంభాలలాగ నిలిచి మనిషి వ్యక్తిత్వాన్ని నిలుపుతాయి. ప్రపంచాన్ని అతను చూచే పద్ధతిని, చూడవలసిన పద్ధతిని నిర్దేశిస్తున్నాయి. ఎప్పుడూ ఉన్నదానికంటే ఉన్నతి కావాలని కాంక్షించడం వ్యక్తి, సమాజము సమాంతరంగా చేసే ప్రక్రియ. ఈ ప్రక్రియ ‘నిండుతనాన్ని’ తీసుకువస్తుంది. ప్రపంచాన్ని ‘ఆలింగనం’ చేసుకునే స్థితిని ఆపాదిస్తుంది.
‘నీ కళ్లల్లో కథలు కనిపిస్తున్నాయి. అవి బయటకు రావటానికి కలవరపడుతున్నాయి. కలం పట్టుకో, కథలు వ్రాయి’ అనే ప్రేరేపణ కథారచయిత అంతరంగం నుంచి ఉబికివస్తూ వుంటుంది. బహిరంగ ప్రేరణ ఎంత వున్నా రుూ అంతఃస్ఫూర్తి లేకపోతే రచయిత కంప్యూటర్ మీద చేయిపెట్టడు. (కాగితం మీద కలం పెట్టటం పాత ప్రయోగం అయిపోయింది గదా). ప్రతి వాక్యంలోనూ కదలిక వుండాలి. అది తరువాతి వాక్యంలోనికి అతి సహజంగా దొర్లుకుపోవాలి.
కథ చివరలో వచ్చే దృశ్యాలు- ఫొటో తీసి మధ్యలోనే అతికించి, జీవిత గమనాన్ని తారుమారు చేయవచ్చు. మనిషిలాగానే కథకూడా ఎప్పటికీ అంతం కాదు, చచ్చిపోదు. కథ రాయడం పూర్తయిపోయి, ప్రచురణకు పంపించిన తరువాత రచయిత దానిని గురించి మరచిపోయి, తరువాతి రంగం/ అంకం గురించి ఆలోచించడం మొదలుపెట్టాలి. కథ ప్రచురణ అయిపోయిన తర్వాత అది ఆకాశంలో వదలిన గాలిపటం లాగ పరుగులుతీస్తూ వుంటుంది. ఎప్పటికీ రాని ఉత్తరంకోసం ఎదురుచూస్తూ ఆస్పత్రి మంచంలో పడివున్న గాయపడిన మనిషి లాగ తయారవకూడదు రచయిత. అతని చూపు ఎప్పుడూ భవిష్యత్తువైపే. వర్తమానంనుంచి ముందుకు దూకేశాడు. కథ పూర్తి అయిపోగానే. అతని మనసులోనుంచి ఒక భావకిరణం బయటకు వెళ్లిపోయింది. ఆ కిరణం మళ్లీ తిరిగిరాదు, దానిని పట్టుకోలేము, దాని ప్రవేగాన్ని, ప్రవాహాన్ని ఆపలేము. ఒక అనుభూతి బయటకు వెళ్లిపోయింది. రెండో దానికోసం జీవితం వెదకడం ఆరంభించింది. బండబారిపోయిన బతుకు లోంచి కొత్త అనుభూతికోసం అనే్వషణ, దానికీ స్థిరీకరించాలనే సంకల్పం బయలుదేరాలి.
కుటుంబంలో సంభవించిన మృత్యువును మనసులో పదిలపరుచుకుని కథలకు కథలే విరివిగా వ్రాసినవాళ్లున్నారు. బతికి వున్నప్పుడు ఆ మృత్యువుతో తమకున్న సంబంధం, అతన్ని అర్థం చేసుకోలేకపోయిన సందర్భాలు, అతను యింకా కళ్లముందే వుంటే బతుకుబాట ఎలా వుంటుందనే ఆలోచన... యివన్నీ కథలు. కథలలో పొదిగిన వ్యథలు. బయటి సంఘటనలు, ఆంతరంగిక కథనం కలగల్పుగా కలిసిపోవాలి. ఎంత ప్రయత్నించినా దొరకని స్వేచ్ఛను, తన హృదయంలోనే పదిల పరచుకోవాలనే తపన ఎన్ని కథలనయినా కల్పించి రచింపచేస్తుంది. రచన పదిలంగా సాగితే చదువరులను ‘రంజింప’చేస్తుంది. రచయిత యేకాంతం, చదువరులకు కూడా స్వగతం అవుతుంది. అనుభవాలను అనుభూతులను రంగరించి జీవితాన్ని ఎప్పటికప్పుడు కొత్తగా పునర్నిర్మాణం చేసుకున్నట్లే, కథలను కూడా పరంపరగా మానవ ప్రకృతికి ప్రతీకలుగా తీర్చిదిద్దుకుంటూ వ్యాసంగం ఎంత కాలమయినా కొనసాగించవచ్చు.

- శ్రీవిరించి, ఫోన్ : 09444963584