సాహితి

ఎన్నారైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదో పెద్ద చెరువు
పట్నానికి తాగునీరందించే నీటి వనరు
చుట్టూ చెట్టూచేమా
సీజనల్‌గా ఎన్నారై పక్షులూనూ
పట్నం సిటీగా మారింది
గుడారంలో తల ఉంచిన ఒంటె, ముందు తన కాళ్ళనూ
నెమ్మదిగా శరీరాన్నీ, తదుపరి గుడారం
మొత్తాన్నీ ఆక్రమించి బేహారుని బయటికి నెట్టింది
చెరువు అంచుల చుట్టూ
కబ్జా ప్రహరీలూ, ఇళ్ళూనూ,
చెరువు ‘తమ’ని కబ్జాచెయ్యకుండా!!
చెరువులో గుర్రపుడెక్క పుష్కలంగా పెరిగి
నీటిని కూడా కనపడనివ్వలేదు
సిటీని గ్రీన్ చేయాలనే కమిటీలకి
ఈ చెరువు కనపడదు
వంది మాగధుల ఇళ్ళకి ఇబ్బందని
కబ్జాదారులందరూ ఏదో ఒక
పక్షి జంతు రక్షణ సంస్థల్లో సభ్యులే!
సీజన్ రాగానే వలస వచ్చిన ఎన్నారై పక్షులు
చెరువును మింగిన విధానానికి బిత్తరపోయి
మరోచోటు వెతుక్కోడానికి వెళ్ళిపోయాయి
వాటి పిచ్చి గానీ అక్కడ ఉన్నది మాత్రం
మనుష్యులు కాదూ???

- కె.వి.సుబ్రహ్మణ్యం