సాహితి

నేను బహువచనాన్ని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను ఒంటరిగాడినే
ఒక్కడిగా ఉన్నప్పుడు
గుంపులోని జనంలో
నేనెప్పుడూ అందరిని

బృందగానంలో
నా గాత్రం కలిస్తే
నా గళం ఒక్కటి కాదు
అది కోటి గొంతుకల
కమనీయ గానం

వీణలోని తంత్రులవలే
అందరిలో కలిసున్నప్పుడు
నా నాదం
అమృత వాయిద్యం

వర్షంలో ఓ చినుకునైనా
నదిలో పడితే నదినౌతానని
గాలిబ్ చెప్పిన మాటలు
నా అంతరాంతరాలల్లో
స్ఫూర్తినిస్తూనే ఉంటాయి

భూమిలో విత్తుగా
ఒంటరితనం అనుభవించి
మొలకెత్తి కళ్ళుతెరిస్తే
నాకే గర్వమనిపించింది
సైనికుల్లా వరుసల్లో
నిలబడ్డ చివురుల్లో
నేనూ భాగమని

అందుకే చెబుతున్నా
నేను
ఏకవచనాన్ని కాదు
ఎప్పుడూ బహువచనాన్ని

- జంధ్యాల రఘుబాబు, 9849753298