సాహితి

ఉదయ రాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలతెలవారుతోంది పల్లె కాశ్మీరం!
రెప్పలు తెరిచిన పడుచు వేకువ.. చీకటి పాయలు చిక్కులు దువ్వుతోంది!
లేమంచు స్నానం, ఆపై చలిమంటల కుంపట్లు..
కురులకు సాంబ్రాణి ధూపంలా!
ఎమ్మెస్ సుబ్బులక్ష్మి సుప్రభాతంకన్నా ముందే మంద్రస్థాయిలో
వాకిలి ముందు అమ్మ శుభ్రంచేస్తున్న పొరక్కట్ట గాత్రం వినిపిస్తుంది!
మబ్బుచాటు మాటువేసి చురచురచూస్తున్న
అరకొర సూరీడు పొద్దుబాణాలు సంధిస్తున్నాడు!
‘లేవండర్రా బారెడు పొద్దెక్కింది’ అంటూ
‘తేషాం ప్రభాతసమయే.. పరమాం ప్రసూతే’ని మరిపిస్తుంది..
‘‘్భజగోవిందం.. భజగోవిందం.. మూఢమతే..’’ మధ్యలో
ప్రతిమధ్యమావతిలా పరకాయ ప్రవేశంచేస్తూ..
బీరకాయలూ, బెండకాయలూ, దోసకాయలు, ములక్కూరే.. అంటూ
ప్రాతఃకాల వీచికల్లా కూరలమ్మి కేకలు శృతిశుభ్రంగా
వీధి చివరినుండి ఇంటిముందుకలా ప్రసరిస్తాయి!
తలపాగా, నోట్లో వేప్పుల్ల కావడి బద్దతో నాన్న నీళ్లు తెచ్చి,
పచ్చగడ్డి మోపు విదిలించి వేసే లోపలే ఆత్మారాముడి ఆకలికి ఆగలేక
మోరెత్తిచూస్తున్న పాడిగేదె గుప్పెడు గడ్డి నోటినిండా లాక్కుంది..
నులక మంచం దిగి కళ్లునులుముకుంటూ దీపావళికి దాచిన
చిన్న టపాకాయని కాల్చి దినచర్య ప్రారంభం..
రాత్రి కప్పుకున్న చీకటినంతా ఒక్కసారి విదిలించి
ఒళ్లంతా విరుచుకుని భౌభౌమంటూ గోల భైరవుడు వీధిలోకి గెంతాడు!
బావిదగ్గర గినె్నలపై ఆహారానే్వషణ చేస్తూ కాకుల కలహాల కూతలు!
నిక్కపొడుచుకున్న ఈకలతో తల్లికోడి తన పిల్లలతో ఇల్లంతా సందడి చేస్తోంది!
ఇటుకల పొయ్యికి ఒదరగొట్టంతో ఊపిరిపోస్తూ
‘బడికి టైమైందంటున్న’ అమ్మ ఆదుర్దా ఒక ప్రక్క.
చిట్టిచెల్లెలి రెండు జళ్ల రిబ్బన్లు అమ్మవిప్పుతుంటే బార్బీగర్ల్ బొమ్మకి
చీర చుట్టివ్వమని మారాం చేస్తోంది!
తలంటుతున్న అమ్మకాళ్లను చేతులతో చుట్టేస్తే
లయబద్ధంగా కాళ్లు గంగ్నమ్ నృత్యం చేస్తున్నాయి!
తొట్టిదగ్గర స్నానం, ఉడుకు నీళ్ల ఆనందం!
నైటాల్టు బస్సు తొలి ట్రిప్పు హారన్ మోత విని
మావూరి చుట్టాల ఉరుకుల పరుగులు..
మంద పశువులతోపాటే వెనక
మేమూ పలక, పుస్తకాలు సంచులతో బడికి సాగిపోతాం!
తలచుకునేకొద్దీ గుర్తుకొస్తున్న కమ్మని మహోదయాలు,
ఇప్పుడేవీ ఆ కమనీయ బంధాలు?

- కాళిదాసు ఆనంద్, 9133366955