సాహితి

సోపతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషన్నాక జిగ్రి దోస్తులుండాలె
మనిషి మనిషికీ మహా సోపతి గాళ్లుండాలె
కరచాలనమే ఒక నులివెచ్చని స్పర్శ

బాధల గాథలు బొక్కెనతో చేది
తల్లడిల్లిన మనసును సేద తీర్చేందుకు
సావాసగాళ్లు ఒక్కరిద్దరైనా ఉండాలి

ఆత్మాఆత్మ ఆలింగనం చేసికొని
ఆపతిల ఆదుకొనే ఆకృతి స్నేహం
జిందగీ నిండా జిలుగు వెలుగుల పూలు

ఎక్కడా చెప్పుకోరాని ముచ్చట్లు
పంచుకోవాలనిపించని పలుకులు
తలమీంచి బరువు దించేది చెలికాడే
తీగ పందిరి మీద పారినట్టుగ
మిత్రత్వమూ పొంతనగా ఎదగాలి
జాన్ జిగ్రి దగ్గరితనం
మనసు భాష తెల్సిన భాషణం
కనురెప్పల కాంతి చదివిన రహస్యం

జీవిత మహావృక్షం నిలువెల్లా
తీగలు తీగలుగా పచ్చని స్నేహమై పారాలె
మనుషులన్నాక జిగ్రిదోస్తులుండాలె
ఆపతికి సోపని ఒక బహుమతి

- అన్నవరం దేవేందర్