సాహితి

మట్టి మళ్లీ నవ్వుతోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విష రసాయన ఱంపాల కోతలో
ఏళ్ల తరబడి గుక్కపట్టి ఏడ్చిన మట్టి
ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటోంది
జీవామృతాన్ని జీర్ణించుకుని
వైనంగా గుల్లబారి గుంభనంగా నవ్వుతోంది
ఆరార అగ్న్యస్త్ర కషాయాన్ని ఆరగించి
ఆకుపచ్చ శస్త్రాలను ఆకాశంవైపు నిలబెడుతోంది
పునర్జీవం పొందిన వానపాములు
మట్టితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాయి
శ్రద్ధగా బోధనలు వింటున్న శిష్యుల్లా
వరసలు తీరి కూచున్న బోదెల్లో వేణుగానం
మట్టిరేణువుల మద్దెలదరువు
జలపాత సంగీతానికి వంత పాడుతున్నాయి

ఒంటినిండా విటమిన్లు తొడుక్కున్న కూరగాయలు
మొక్కలు ధరించిన ఆభరణాల్లా
నిగనిగలాడుతున్నాయి
ఎర్రెర్రగా నవ్వుతున్న రామ్ములక్కాయలు
వయ్యారంగా వనె్నలీనుతున్న వంకాయలు
చిక్కుప్రశ్నల్లా తీగల మధ్య చిక్కుబడిన చిక్కుళ్లు
దొర్లటం మర్చిపోయిన బంతుల్లా
పొలంనిండా దోసకాయలు
గుత్తులు గుత్తులుగా విచ్చుకున్న పచ్చిమిర్చి
తీరిగ్గా పడుకొని తలలాడిస్తున్న ఆవుల్లా
ఆకుపచ్చ అలల్లా ఆకుకూరల మడులు
నిన్నటిదాకా వీచిన ఆమ్లగాలుల్ని ప్రక్షాళన చేస్తూ
కొత్తిమీర మడులమీదగా ఒక దివ్య పరిమళం

నాలుగాకులు తుంచి నోట్లో వేసుకుంటే
నాల్కలు చాచిన జఠరాగ్ని జ్వాల
ఆంధ్రమాత బిరుదుతో విర్రవీగుతున్న గోంగూర
పరిసరాల్ని సువాసనలతో అలంకరిస్తున్న పుదీనా
మేం లేనిదే మీ ‘పప్పు’లు ఉడకవంటూ
తోటకూర, పాలకూర, బచ్చలికూర, మెంతికూర..

పంచభూతాలే పెట్టుబడులు
ప్రకృతి వనరులే సేంద్రియ సేద్యసాధనాలు
అయితే నాలుగు ఋతువులు ఆలస్యం కావొచ్చు
ఈ చారెడు పంట సహజాతి సహజంగా
కన్యాకుమారి నుంచి కాశ్మీరు దాకా విస్తరిస్తూ -
*
- ఎవీ రామిరెడ్డి, 9855777870

- ఎవీ రామిరెడ్డి, 9855777870