సాహితి

తాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవిత్వం దుకాణానికి తాళం
నిన్ననే మూసేసాను

దివాలా
పాఠకులు లేరు

ఈమధ్యంతా
మాత్రాధిక ప్రేమతో
కంపిస్తున్నా
ఎవరితో మాట్లాడినా
కళ్ళల్లో నీళ్ళు

102 డెంగీ జ్వరం
తగ్గదు

ఇలాగె చచ్చిపోతానేమో
వార్తలేమీ రాయొద్దు
నా స్మృతిలో
టేబుల్ మీద
ఒక పువ్వు చాలు

నిన్న నేడు రేపు కూడా
రాసే వారెప్పుడూ
అనామకులు
ప్రజాఅశ్రువులు

రాజ్యం విధేయత కోరుతుంది
కవులు అగ్గిపుల్ల వెలిగిస్తారు
*

- విజయచంద్ర, 9438720409