సాహితి

ప్రపంచ యాత్ర - ప్రయాణికుడి పాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘శేషయ్య కోటు జేబులోనుంచి కలం తీశాడు. టేబుల్‌మీది కాగితం తీయబోయి మానుకుని జేబులోని భగవద్గీత పుస్తకం తీశాడు. దానిమధ్య మడిచి ఉన్న తెల్ల కాగితం తీశాడు. ఆ క్షణాన ఆయన మనసులాగున నలిగి ఉన్నది ఆ కాగితం. ఆ పోలిక గుర్తుకు వచ్చి నవ్వుకున్నారాయన. నవ్వుకుని అమ్మవారి వైపు చూస్తే ఆమె ప్రశాంతంగా చూచింది. గబగబా ఉత్తరం రాశారు. శేషయ్య సంతకం పెట్టారు. తరువాత తారీకు వేయబోయి కేలండరు వైపు చూచాడు. ఆరోజు 1947 డిసెంబరు 6వ తేదీ. శ్రీ వాకాటి పాండురంగారావు వ్రాసిన కథానిక ‘ఒక బాటసారి’లో సన్నివేశం ఇది. ‘జగత్ అంతా నాటక రంగం, ప్రతి ప్రయాణికుడు ఇందులో పాత్రధారే..’ అన్న కవిత్వ గీతం గుర్తుకువస్తుంది కథ చదువుతున్నంతసేపూ. భగవంతుడి మీద- ఏ దేవతమీదనో భారం వేసి జీవితం గడిపేవాళ్ళు కొందరు. జీవితంలో ఏ ఒడిదుడుకులు, సిరిసంపదలు తారసిల్లినా అవన్నీ దైవదత్తం అనుకుని అనుభవించే వాళ్లు కొందరు.
ఇంతకూ శేషయ్య సంగతి ఏమిటి? ఆయన పదిహేనేళ్ళ క్రితం, నారాయణయ్య అనే ఆసామితో కలుసుకోవడం జరిగింది. నారాయణయ్య వెయ్యి రూపాయలతో చెన్నపట్టణం వచ్చి వ్యాపారం మొదలుపెట్టాడు. ‘నారాయణ ధనము, శేషయ్య ధీశక్తి కలిసి- ఇనప పెట్టెలు ట్రంకులు చిల్లరగా అమ్మే వ్యాపారం మొదలయింది.. తరువాత అయిదేళ్ళలో ఇనుపపెట్టెలు తయారుచేసే కార్ఖానాకు నారాయణ స్వంతదారు అయినాడు. శేషయ్య సలహా సంప్రదింపులతోనే తను రుూ అభివృద్ధి అంతా సాధించగలిగాననే కృతజ్ఞత నారాయణకు వుంది. ఆయితే అతను చనిపోయే ముందు కొడుకుతో శేషయ్యగారిని తండ్రిలా భావించమని కూడా చెప్పినా, ఆ కొడుకు మధుసూదనరావు అకస్మాత్తుగా శేషయ్యను మేనేజర్ ఉద్యోగం నించి తొలగించి, ఓ మామూలు గుమాస్తాగా ఉండమన్నాడు- ‘అదే జీతం’ అని కూడా భరోసా ఇచ్చాడు. ఈ అవమానానికి తట్టుకోలేని శేషయ్య ఉద్యోగానికి రాజీనామా చేసి ‘గాజు పలక కింద అమ్మవారి పటాన్ని తీసి కళ్ళకద్దుకుని జేబులోని భగవద్గీత మధ్య పదిలపరచుకున్నాడు, బయటకు నడిచాడు’.
శేషయ్యకు ఇరువురు సంతానం. ప్రసాద్, అపర్ణ. ఇంకా చదువులలోనే వున్నారు. ‘ఉద్యోగంలో వుండగా నిలవ చేసిన కొంత మొత్తం ప్రాణాధారం అయింది’. రోజులు గడపడం కోసం శేషయ్య ట్యూషన్లు ఏర్పాటుచేసుకున్నాడు. ఆయుర్వేద కంపెనీలో మందుల అమ్మకం చేసే కమిషన్ వ్యాపారం కూడా తగిలించుకున్నాడు. పిల్లల ఆలనా పాలనలో ఎటువంటి లోటు, తగ్గుదల వుండకూడదని శ్రమిస్తాడు. ఇతరులకు చేయగలిగిన సహాయం చేయడంతో ఆయన ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు, సాధ్యమైనంత వరకు. తన బీదరికంతోనే తృప్తిపడి జీవనం సాగిస్తున్నాడు. కొడుకు ప్రసాద్ బి.ఏ ప్యాసయి, స్నేహితులతో విహారయాత్రగా బొంబాయి వెళ్లి కారు ప్రమాదంలో చనిపోతాడు. ఆ వార్త తెలుసుకున్న తల్లి హృదయం దహించుకుపోయి ‘వరుసగా ఆరుగురిని పోగొట్టుకున్న తరువాత వీడొక్కడు మిగిలాడనుకున్నాను. ఇరవై యేళ్ళపాటు మమ్మల్ని మురిపించి మురిపించి ఇపుడు తీసుకువెళ్లావా అమ్మా.. కళకళలాడుతున్న నా బాబుకు పరాయి ఊళ్లో కారు ప్రమాదంలో ముగింపా తల్లీ!’ అంటూ రోదిస్తుంది.
కష్టాల కడలి అంతటితో ఆగలేదు.
కూతురు అపర్ణ మరో కులం పురుషుడిని పెళ్లిచేసుకువచ్చి తల్లిదండ్రుల ఆశీర్వచనం కోరుతుంది. ‘పార్వతీ! అక్కడున్న ఆ ఆడమనిషినీ, ఆ ఇంకో వ్యక్తినీ, మనకు తెలియదు, వాళ్లిద్దరినీ వెళ్లిపొమ్మను’ అంటాడు శేషయ్య భార్యతో. ‘పార్వతమ్మ గుండె పగిలింది. దేవుడి గదిలో రెండో దీపమూ ఆరింది’.
తరువాత ఆమె సుస్తీపడి నెలరోజులపాటు లేవలేదు. శేషయ్య నీరసించి బయట తిరగడం మానుకున్నాడు. రోజులు యిలా సాదాసీదాగా గడిచిపోతూ వుండగా శేషయ్యకో పగటి కల వచ్చింది. ‘ఎర్రటి పావడా వేసుకుని కిరణంలా వెలిగిపోతున్న అమ్మాయి గెంతుకుంటూ వచ్చింది. ఎత్తుకోపోయిన శేషయ్యకు సింహం గాండ్రుమని అరుస్తూ ఆటంకపరిచింది. ఆ అమ్మాయిని చూడగానే సింహం తోక ముడుచుకుని నిల్చుంది. చలాకీగా సింహంమీదకెక్కి ఠీవిగా కూర్చుంది అమ్మాయి. సింహం పరుగెత్తసాగింది. దాని వెంబడే పరుగెత్తసాగాడు శేషయ్య’. అమ్మాయి అపర్ణ సంవత్సరం క్రితం అమ్మయిని కని చనిపోయిందనీ, రుూ అనాథ శిశువును తన దగ్గరకు తీసుకొచ్చుకున్నాననీ- నెల్లూరులో తెలిసిన వ్యక్తి వ్రాసిన ఉత్తరం అందుతుంది. ‘చీర చెంగుతో కళ్లొత్తుకుంది పార్వతమ్మ. జగన్మాతయే తల్లియై, తండ్రియై ఆ పసిపాపను చిరంజీవిగా చేయాలని అర్థించింది ఒక హృదయం’ అన్న వాక్యంతో కథ ఆసాంతం అవుతుంది. మంచికి, చెడుకు యితరులనెవ్వరినీ మెచ్చుకోకుండానూ, తిట్టుకోకుండానూ అన్నిటికీ దైవ సంకల్పమే కారణం, మనం ‘నిమిత్తమాత్రులం’ అనుకునే దంపతుల కథ.
పాండురంగరావు మంచి కథలు వ్రాసిన వ్యక్తేకాదు, గొప్ప సంపాదకుడుగా ప్రసిద్ధి పొందారు. జీవిత తాత్త్వికతకు అనుబంధంగా జీవితం గడిపారు. తెలుగు, ఇంగ్లీషు పత్రికలకు సంపాదకులుగా వ్యవహరించి మన్ననలు పొందారు.

- శ్రీవిరించి, 09444963584