సాహితి

అనుభూతి కవితా ఝరి.. రాజేశ్వరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివలెంక రాజేశ్వరీదేవి చిరపరిచితమైన కవి. స్వస్థలం
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట. జననం 1954. రచనా వ్యాసంగం 1970లలో ఆరంభించారు. కడవరకు కొనసాగించారు. అరుదైన కవిగా ఆదరణ పొందారు. గత నలభై ఏళ్ళలో ఆమె రచనలు కొన్ని రేడియోలో ప్రసారం కాగా పత్రికల్లో అనేకం
అచ్చయ్యాయి. రాజేశ్వరీదేవి గుంపున ఎప్పుడూ లేరు.
జీవితంలో ఏకాకిగానే తలపడ్డారు. చంద్రుడికి జతగా
జాగరణ చేశారు. ఆ కలత, కలవరింతలే ఆమె కవిత్వం. స్వప్నంమీంచి కోకిలవలె పాడుతూ పాడుతూ
2015 ఏప్రిల్ 25న నక్షత్రంలోకి ఎగిరిపోయారు.

విత్వానికి పునాది అనుభూతి. కవిత్వం పండించేది అనుభూతి; పాఠకుడికి అందించేది అనుభూతి. అనుభూతి తిరిగి అక్షరరూపం దాలిస్తే మళ్లీ కవిత్వం అవుతుంది.
ఆర్థిక శాస్త్రంలో ధనము అనే దానికి ఒక చమత్కార పూర్వకమైన, అనుభవ పూర్వకమైన నిర్వచనం ఉంది. ’్యశళక జఒ త్ద్ఘీఆ జఆ జ్యూళఒ’ (డబ్బు అంటే ఏమిటి అంటే అది ఏమి ఒనగూర్చుతుందో అదే) అని. దాదాపు కవిత్వం కూడా ఇలాగే పూర్వ పర రూపాలమధ్య విలాస లాస్యం చూపిస్తుంది.
ఈ రకమైన కానె్సప్ట్‌కు శివలెంక రాజేశ్వరి కవితా ప్రస్థానం ఒక తార్కాణం.
అలాంటి ఇంట పుట్టిన రాజేశ్వరికి సాహితీ ‘వాసనా’ జన్యువులు సహజంగానే సంక్రమించాయి. ఆ జన్యువులే తన చేత బహుళ సంఖ్యలో బహు ప్రశంసనీయ కవితలను రాయించాయి. రాజేశ్వరి రచనం ఆధునికోత్తర కవిత్వం (ఔ్యఒఆ యౄజూళూశ ఔ్యళఆక) కిందికే వస్తుంది అధిక శాతం.
ఈ రకమైన కవితా ధోరణికి ఆలంబనం ‘నేపథ్యం’. ఈమె ప్రతి కవితకూ ఒక నేపథ్యం వుంటుంది. అది పట్టుకుంటేనేగాని ఆ కవితను అనుభూతించలేము. భావ వ్యక్తీకరణ పరంగా స్టాంజాల (డఆ్ఘశచ్ఘీఒ) అన్నిట్లోను సమత ఉండదు. కొంచెం తొట్రుపాటు, తడబాటు ఉంటాయి. అయినా కవిత్వం పూర్తిగా చదివాక అందులోని భావార్ద్రత పాఠకుడిని ఆకట్టుకుంటుంది.
ఈ భావార్ద్రత అనే విలువైన కవితా వస్తువును చూసి మెచ్చుకున్న ఆకాశవాణి, పత్రికా ప్రపంచం- ఈ రెండూనూ రాజేశ్వరిని అడిగి మరీ కవితలు రాయించుకున్నాయి. అది చాలు ఆ సోదరి సారస్వత జీవిత ధన్యం అయిందని చెప్పటానికి. భావార్ద్రతే గాకుండా రాజేశ్వరి కవితలలో భావ ఉదాత్తత, నైర్మల్యాలు కూడా చూడగలం.
‘ద్వైతం’ అనే తన కవితలో నేనసలే గంగను కదా/ నాకు పర్వతమూ ఇష్టమే పొలమూ ఇష్టమే / గండశిలల్నించి కరిగి కిందికొచ్చినందుకే / ఈ మునిగిపోయిన పేద పల్లెల కన్నీళ్ళు ఇష్టం అంటుంది. మొదటి రెండు పంక్తుల్లో పరిపూర్ణ మానవత నవనవలాడుతూ నాట్యం చేస్తుంది - భావ నైర్మల్యంతో. ‘మునిగిపోయిన పేద పల్లెల కన్నీళ్ళు ఇష్టం’ అనటంలో ఉంది ఆలోచనాత్మకమైన ఉదాత్తత.
వరదలకు ‘పేద’ పల్లెలు మునిగిపోతాయి. అమాయక జానపదులు అతలాకుతలం అయిపోతారు. వాళ్ళ కళ్ళల్లో ఆర్తి కనిపిస్తుంది. అయోమయత కనిపిస్తుంది. నిస్సహాయత కనిపిస్తుంది. ఆ మూటినీ సమ్మేళనం చేసుకొని భావిస్తే ఆ నీరపు రాక తమ మేలుకో కీడుకో కూడా అర్థం చేసుకోలేని ఆ జనుల నిసర్గ అమాయకత నన్ను ఏవో ఏవో అనంత ఆలోచనా లోకాల్లోకి తీసుకుపోతుంది. అంత శక్తి ఉంది ఆ కన్నీళ్ళకు. ఆ కన్నీళ్ళు ఇక జిజ్ఞాసలోకి నన్ను నెట్టివేస్తాయి. అందుకనే ఆ కన్నీళ్ళు నా కిష్టం అంటుంది. ఇది ఈ కవయిత్రి ఆత్మాశ్రయ కవిత్వానికి ఒక ఉదాహరణ.
రాజేశ్వరి కవిత్వం ఎప్పుడూ ఒక నిరాశావాది ఆశావాద కవిత్వం; ఒక ఆశావాది నిరాశావాద కవిత్వం- ఆమె రాసిన చాలా కవితలను పట్టి చూస్తే. రాజేశ్వరి కవితలలో ముప్పాతిక మువీసం కలలు, కలతలు, కష్టాలు, కన్నీళ్లు, నిరాశ, నిస్పృహ, నిర్వేదాలే కనిపిస్తాయి. ఇకపోతే సమాజంలో నేడు తరచుగా కనిపిస్తున్న నడమంత్రపు సిరిగాళ్ల అహంకార, అవాంఛనీయ ధోరణులను తరచుగా నిరసిస్తూ ఉండేది తాను నాతో మాట్లాడేటప్పుడు. సాధారణంగా రాజేశ్వరి కంఠం లోటోన్‌గానే వుండేది. సుకుమారంగా కవిత్వం రాసే వాళ్లు అలా మాట్లాడితేనే బాగుంటుంది అనిపిస్తుంది. మరికొన్ని దశాబ్దాల పాటు మనిఉంటే మణిదీపాల్లాంటి మంచి మంచి కవితలను మరిన్ని వెలిగించుకునేది. ‘‘నిండు ప్రాణాలు నిలువున పిండుకొనెడి / గుండె తడి లేని కర్కోటకుడు వాడు’’ అన్న కరుణశ్రీ పద్యపాదాలు రెండు గుర్తు వస్తున్నాయి రాజేశ్వరి లేమిని తల్చుకుంటే.

- శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం, 9849779290