సాహితి

జీవన రేఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్రవ్యోల్బణం ‘జాతీయం’ చేయబడింది!
ధరలు అభివృద్ధిపథంలో...
కరెన్సీ ఖరీదు దినదినం తగ్గు
ప్రజల జీవన ప్రమాణం
ధర్మాసుపత్రిలో జీవనరేఖ
భూకంప లేఖిని గీస్తున్న గీతలా
పైకీ కిందకు ఊగిసలాడుతోంది
ఎక్కువ ఓట్లు పొందినవారు
ఎక్కువ ధరలు చెల్లించే స్థితిలో ఉన్నారు
పాపం పేదవాడు
ఓటుకు రేటు తగ్గింది
తప్పు చేశానేమోననీ
తప్పటడుగు వేశానేమోననీ
పశ్చాత్తాప పడుతున్నట్లున్నాడు!
పాలకుల పార్టీలు మారిపోతున్నాయి
పార్టీల ఎజెండాలూ మారిపోతున్నాయి
కానీ ప్రజల స్థితిగతులే
మార్పుకు దూరంగా ఉన్నాయి

- సోమిశెట్టి వేణుగోపాల్, 8977349361