ఐడియా

ఉప్పునీటి స్నానం ఉత్తమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శారీరక శుభ్రత, మానసిక ఉత్తేజం కోసం రోజూ స్నానం చేయడం అందరికీ తెలిసిందే. అయితే, ఉప్పు కలిపిన నీటితో తరచూ స్నానం చేస్తుంటే ఆరోగ్యరీత్యా ఎంతో మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. వంటకాల్లో రుచి కోసమే కాదు, స్నానం చేసే నీళ్లలో కాస్త ఉప్పు కలిపితే పలు అనారోగ్య సమస్యలు దూరం అవుతాయంటున్నారు. ఉప్పు నీటితో స్నానం చేస్తే చర్మంపై మచ్చలు తొలగిపోతాయి. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉప్పు కలిపిన నీటితో సున్నితంగా శరీరాన్ని మర్దనా చేసుకుంటే రక్తప్రసరణ తీరు మెరుగవుతుంది. ఉప్పులోని సహజ సిద్ధమైన ఖనిజాలు, పోషకాలు చర్మానికి మేలు చేస్తాయి. చర్మంపై పగుళ్లు, మచ్చలు,నలుపుదనం తొలగిపోయి మంచి నిగారింపు వస్తుంది. ఉప్పు నీటి వల్ల పాదాలు, చేతి వేళ్ల మధ్య మురికిదనం తొలగిపోతుంది. టాక్సిన్లు, బ్యాక్టీరియా బారి నుంచి చర్మాన్ని కాపాడుకోవాలంటే ఉప్పు నీటితో స్నానం చేస్తుండాలి. చర్మం ఆరోగ్యవంతంగా, కాంతివంతంగా ఉండేలా ఉప్పులోని ఖనిజాలు దోహదపడతాయి. చర్మం ముడతలు పడుతుంటే వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తున్నాయని ఆందోళన చెందేవారు ఉప్పునీటితో స్నానం చేయడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. చర్మంపై పుళ్లు, పొలుసులు, ఒరిసిపోవడం ఉంటే ఉప్పునీటితో కడిగితే సాంత్వన లభిస్తుంది. చర్మ సంబంధమైన సమస్యలనే కాదు, ఆస్టియో ఆర్థరైటిస్, వాపులను కూడా నివారించేందుకు ఉప్పునీటితో స్నానం చేయడం మంచిది.