అనంతపురం

మాతృ మరణాలు తగ్గించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* కలెక్టర్ కోన శశిధర్
అనంతపురం , మార్చి 15: వైద్యం అందక ఏ ఒక్క మాతృమూర్తి మరణించకుండా చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరు చిత్తశుద్ధితో పనిచేసి మాతృ మరణాలను అడ్డుకోవాలని కలెక్టర్ కోన శశిధర్ డాక్టర్లును, వైద్య సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం రెవిన్యూ భవన్‌లో జిల్లాస్థాయి మాతృ మరణాల సమీక్షా కమిటీ సమావేశం కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఎటువంటి లోపాలు ఉన్నాయో సరిచూసుకుని వాటిని పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. 100 శాతం ప్రసవాలు ఆసుపత్రుల్లోనే జరగాలన్నారు. అలా జరగకపోతే ఎఎన్‌ఎంలు బాధ్యతవహించాలని, వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల వైద్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందన్నారు. నిధులకు కొరత లేదని, క్షేత్రస్థాయిలో పర్యటించి గర్భణీలకు అవగాహన కల్పించి ఐరన్ టాబ్లెట్లు, పౌష్టికాహారం, హెల్త్ చెకప్‌లు చేయించుకోవడంతోపాటు ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరగాలని అవగాహన కల్పించాలన్నారు. గర్భిణిగా ఉన్నప్పుడు బరువెంత, ప్రసవ సమయానికి బరువు ఎంత ఉన్నారో రిపోర్టులు రూపొందించాలని ఆదేశించారు. ఆరు నెలలు నిండిన గర్భిణీలలో కనీసం 10 హెచ్‌బి ఉండాలని, అలా ఎంతమంది గర్భిణీలు ఉన్నారో నివేదిక వెంటనే తయారుచేయాలని ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా రక్తహీనత ఉన్న గర్భిణీలలో హిమోగ్లోబిన్‌ను పెంచాలన్నారు. రక్తహీనతతోకానీ, సకాలంలో వైద్యం అందక ఒక్క మరణాన్ని ఆపగలిగితే చంటిబిడ్డకు తల్లిప్రేమను అందించవచ్చునన్నారు. ప్రతి అబార్షన్‌లపై సహజమైన అబార్షన్ లేక మరే ఇతర కారణమా అని ఆడిటింగ్ జరగాలని ఆదేశించారు. లింగనిర్థారణ చేసే స్కానింగ్ కేంద్రాల సమాచారాన్ని అందిస్తే 2 లక్షల బహుమానాన్ని అందిస్తామని ఆయన తెలిపారు. వివరాలు తెలియజేసిన వారి చిరునామాలు గోప్యంగా ఉంచుతామని, భయపడాల్సిందేమీ లేదన్నారు. నానాటికి బాలికల శాతం తగ్గిపోతుందని, ఇది అత్యంత దురదృష్టకరమన్నారు. గర్భిణుల బాగోగులపై ఎఎన్‌ఎంలు, అంగన్‌వాడీ కార్యకర్తలు బాధ్యతవహించాలన్నారు. మాతృ మరణాలపై 15 కేసులను కలెక్టర్ విచారించారు. ఈ కార్యక్రమంలో జెసి-2 సయ్యద్ ఖాజామొహీద్దీన్, డియం అండ్ హెచ్‌ఓ డా.వెంకటరమణ, కమిటీ సభ్యులు, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వర్లు, డాక్టర్లు, ఎఎన్‌ఎంలు, మెడికల్ ఆఫీసర్లు, ఆశా వర్కర్లు, చనిపోయిన అమ్మాయి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

రూ.16.50 కోట్లతో పికెబి ఆధునీకరణ
* చెరువులను పరిశీలించిన జపాన్ బృందం
హిందూపురం, మార్చి 15 : హిందూపురం ప్రాంతంలోని చెరువులను ఆధునీకరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఇరిగేషన్ శాఖ ఎస్‌ఇ సుబ్బారావు అన్నారు. మంగళవారం పెన్నార్ కుముద్వతి బాలెన్సింగ్ రిజర్వాయర్(పికెబి)తోపాటు అనుబంధంగా ఉన్న ఏడు చెరువులు, కుడి, ఎడమ కాలువలను జపాన్ ఇండిస్టిరియల్ ఎ ఆపరేషన్ ఏజెన్సీ (జైకా) బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా హిందూపురం రూరల్, పరిగి మండలాల్లోని చెరువులను పరిశీలించి ఆయా ఆయకట్టు రైతులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్‌ఇ సుబ్బారావు జైకా బృందం సభ్యులకు మ్యాప్ ద్వారా చెరువుల కింద ఉన్న భూములు, కాలువ విస్తీర్ణం గురించి వివరించారు. సాయంత్రం ఇరిగేషన్ డిఇ కార్యాలయంలో జపాన్ బృందంతోపాటు కలిసి ఎస్‌ఇ మాట్లాడుతూ రూ.16.50 కోట్ల వ్యయంతో పెన్నార్ కుముద్వతి కాలువ ఆధునీకరణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ నిధులు జైకా సహకారంతో ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఈ పనులు పూర్తయితే 6,126 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. జూన్ నెలాఖరులోగా జపాన్ బృందం నివేదికను హైడ్రాలజీ ఇరిగేషన్ శాఖకు సమర్పిస్తే అక్కడ ఇంజినీర్ పరిశీలించి తుది నివేదికను ప్రభుత్వానికి అందజేస్తారన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే పనులను ప్రారంభించి నవంబర్ చివరి నాటికి పూర్తి చేసి రైతులకు నీరు అందించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. ఆయా కార్యక్రమాల్లో ఎస్‌ఇతోపాటు జైకా టీం లీడర్ కెంచి షిబుతా, సభ్యులు కామియా, హిరాయువా, విశ్రాంత ఇఎన్‌సి, హైడ్రాలజీ ఇరిగేషన్ ఇంజనీర్ అబ్ధుల్ బషీర్, ఇఇ స్వరూప్‌కుమార్, డిఇ శైలేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

కదిరికి బ్రహ్మోత్సవ శోభ
* రూ. 6 లక్షల వ్యయంతో కల్యాణ మండపం
* పట్టణానికి నాలుగు దిక్కులా స్వాగత తోరణాలు
కదిరి, మార్చి 15: కదిరి పట్టణానికి ప్రసిద్ధి చెందిన శ్రీమత్ ఖాద్రి లక్ష్మి నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల శోభ వచ్చింది. 17న జరిగే అంకురార్పణతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆలయంలో అనేక ఏర్పాట్లు చేపట్టారు. ఇందుకు ఆలయ ఈఓ పట్టెం గురుప్రసాద్, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, కదిరి డీఎస్పీ వెంకటరామాంజనేయులు, పట్టణ సిఐ శ్రీనివాసులు తదితరులు తమవంతు సహకారం అందిస్తున్నారు. ముఖ్యంగా స్వామివారి కల్యాణోత్సవం కోసం ప్రత్యేకంగా ఆలయం ప్రాంగణంనందు ఆరు అడుగుల ఎత్తులో కల్యాణ మండపం నిర్మాణం చేపట్టి, రూ. 6 లక్షలు వ్యయం చేసి, ప్రత్యేకంగా మల్లెల పూలతో వేదిక సిద్ధం చేయడం జరుగుతోంది. అంతేగాక కల్యాణోత్సవం జరిగే సమయంలో వర్షం, ఇతర ఇబ్బంది కల్గకుండా సుమారు 15 నుంచి 20 అడుగుల ఎత్తులో శాశ్వత నిర్మాణం చేపట్టి పూర్తిచేశారు. ఇదే విధంగా స్వామి బ్రహ్మోత్సవాలు సందర్బంగా స్వామివారు ఆలయం నుంచి బయటకు వచ్చినప్పుడు అంటే ప్రధాన గోపురం ముందు(రాజగోపురం) కూడా స్వామివారికి అలంకరణ, వివిధ వాహనాలపై స్వామివారి ఊరేగింపు సందర్బంగా ఏర్పాటుచేసే గొడుగులు తగలకుండా కల్యాణ మండపం సమీపంలో ఏర్పాటుచేసిన విధంగా ఎత్తుగా అధునాతన రేకులు వేసి శాశ్వత నిర్మాణం చేశారు. ఇదే సందర్బంలో ఆలయంలో భక్తులకు ఎలాంటి అపరిశభ్రత తల్తెకుండా ప్రత్యేక సిబ్బందిని నియమించి ఏర్పాట్లు ఏమాత్రం సమస్య లేకుండా చూడాలని, ఇందుకు అవసరమైతే మున్సిపల్ శాఖ సిబ్బందేగాక ఆలయం తరుపున కూడా అదనపు సిబ్బందిని తాత్కాలికంగా నియమించుకోవాలని కందికుంట ఆలయ ఈఓకు సూచించారు. బ్రహ్మోత్సవాల సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి నిఘా ఏర్పాటుచేయడంతోపాటు, శాంతిభద్రతల విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం ఇప్పటికే కదిరి సబ్ డివిజన్ పరిధిలోని సిబ్బందిని అంతా కూడా వినియోగించేందుకు జిల్లా అధికారుల నుంచి అనుమతి తీసుకోవడం జరిగిందని డీఎస్పీ వివరించారు. ఏది ఏమైనా కదిరికి బ్రహ్మోత్సవాల శోభ వచ్చిందనేది వాస్తవం.

రేపటి నుంచి పంపనూరు
లక్ష్మీనృసింహస్వామి ఉత్సవాలు
ఆత్మకూరు, మార్చి 15 : మండల పరిధిలోని పి.యాలేరు గ్రామ పంచాయతీ పరిధిలో పంపనూరు సమీపాన కొండపై వెలిసిన శ్రీలక్ష్మీనృసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు ఫాల్గుణ శుక్లపక్ష నవమి 17 నుంచి ఫాల్గుణ శుద్ధ విదియ 25 వరకు నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ కె.విజయకుమార్, ఈఓ నరసింహారెడ్డి తెలిపా రు. 17వ తేదీ రాత్రికి స్వామివారి ఉత్స వ విగ్రహాలను వై.కొత్తపల్లి ఆలయం నుంచి పంపనూరు సమీపాన కొండపె కి ఊరేగింపుగా తీసుకువస్తారు. అనంతరం కలశస్థాపన, అభిషేకం, ధ్వజారోహణ, రక్షాబంధన పూజలు నిర్వహిస్తారు. 18న నవగ్రహ పూజ, పూలకవచము, అభిషేకం, సేవ హోమం, 19న నిత్యపూజ తోమాలసేవ, ఆల్వార్ల అభిషేకం, 20న గజ వాహనం, హోమ ప్రతిష్ఠ, 21న గరుడోత్సవం రాత్రివేళ ఊరేగింపు, 22న శ్రీ భూదేవి శ్రీదేవి సమేత స్వామివారికి కల్యాణోత్సవం, 23న రథోత్సవం, 24న పరుష పారువేట ఉత్సవాలు, 25న వసంతోత్సవం నిర్వహించనున్నారు. వసంతోత్సవంనాడు స్వామివారి ఉత్సవ విగ్రహాలను వై.కొత్తపల్లి ఆలయానికి చేరుస్తారు. దాంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి.పంపనూరు కొండపై పురాతన కాలంనుంచే జంట కోనేరులున్నాయి. గతంలో ఈ కోనేరులో నీటితోనే స్వామివారి పూజా కార్యక్రమాలు నిర్వహించేవారు. అయితే ఇప్పుడు సరైన వానలు లేక కోనేరులోకి నీరు వచ్చి చేరడం కూడా కష్టమవుతోంది. దాంతో కొండ కింది భాగం నుంచి నీటిని పంపింగ్ ద్వారా తెచ్చి కోనేరులు నింపుతున్నారు. ఇప్పుడవి పూజకు పనికి రాకుండా పోయాయి. కలుపితంగా మారాయి. కొండ కింది భాగంలో శ్రీ ఆంజనేయస్వామి కొలువుదీరి ఉన్నారు. ఆంజనేయుడు ఇక్కడ క్షేత్రపాలకుడని ప్రతీతి.

నెమలి వాహనంపై దర్శనమిచ్చిన
చంద్రవౌళేశ్వరస్వామి
ఉరవకొండ, మార్చి 15 : శ్రీ చంద్రవౌళేశ్వరస్వామి రథోత్సవంలో భాగంగా మంగళవారం నెమలి వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఇందులో భాగంగా తెల్లవారుజామున ఆలయంలో సుప్రభాత సేవ, అభిషేకం, ప్రత్యేక అలంకరణ, అర్చనలు, ప్రత్యేక పూజలను నిర్వహించారు. చంద్రవౌళేశ్వరస్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి కరిబసప్పస్వామి మఠం ఆవరణలో ఊరేగించారు. అనంతరం ప్రత్యేకంగా తయారు చేసిన నెమలివాహనంపై స్వామివారిని కొలువుదీర్చి ఎదురుబసవన్న గుడి వరకూ మేళతాళాలతో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఎనిమిదో పీఠాధిపతి జగద్గురు చెన్నబసవ రాజేంద్రస్వామి, సహాయ కమిషనర్ ఆనంద్, ఆలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి శ్రీ శివలక్ష్మీచెన్నకేశవస్వామి
బ్రహ్మోత్సవాలు
యాడికి, మార్చి 15 : మండల కేం ద్రంలో వెలసిన శ్రీ శివలక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నట్లు ఆలయ ఇఓ బాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో చలువ పం దిళ్లు, భక్తుల సౌకర్యార్థం భారీకేడ్లు ఏర పాటు చేసినట్లు తెలిపారు. నేడు తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, విశేష అలంకారాలు ప్రత్యేక పూ జలు నిర్వహించనున్నారు. అదేవిధం గా రాత్రి స్వస్థివాచన, అంకురార్పణం, కళశ స్థాపన పూజలు, 17న యథావిధిగా స్వామివారికి సేవలతోపాటు ధ్వజారోహణ, రాత్రికి పుష్ప విమానోత్సవం, 18న ఉత్సవ హోమం, అభిషేకం, అర్చనలు, రాత్రికి సింహ వాహ నం, 19న ఉదయం హోమం, అభిషేకాలు, అర్చనలు, రాత్రికి శేష వాహనం పై స్వామి ఊరేగింపు, 20న హోమా లు, అభిషేకార్చనలు, రాత్రికి ఆంజనేయస్వామి వాహనంపై ఊరేగింపు, 21న ప్రత్యేక హోమాలతో పాటు గరుడోత్సవం, 22న హోమాలు, రాత్రి గజేంద్రోత్సవం, 23న ఉదయం కల్యాణోత్సవం, మధ్యాహ్నం రథోత్సవం, 24న ఉత్సవం, అశ్వవాహనం, పార్వేట, 25న వసంతోత్సవం, రాత్రికి హంస వాహన సేవ, 26 గ్రామోత్సవం, రాత్రి శయనోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు.

పేరూరు డ్యాం పరిశీలన
* జపాన్ బృందానికి వివరించిన పరిటాల శ్రీరామ్
రామగిరి, మార్చి 15: మండలంలోని పేరూరు అప్పర్ పెన్నార్ డ్యాంను జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ బృందం సభ్యులు కామియా, సిబంటు, హరేవాలు మంగళవారం పరిశీలించారు. వీరితోపాటు ఇరిగేషన్ అధికారులు, యువ నాయకులు పరిటాల శ్రీరామ్, టిడిపి నేతలు కూడా పాల్గొన్నారు. ప్రధానంగా పేరూరు డ్యాంకు నీరు తీసుకురావాలని, డ్యాంను మరమ్మతులు చేయించాలని మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్‌ల చొరవతో జపాన్ ఆర్థికసాయంతో డ్యాం మరమ్మతు పనులు చేపట్టనున్నారు. డ్యాం, కాలువల మరమ్మతులకు రూ.16.50 కోట్లు మంజూరైంది. ఈ నిధులతో ఏయే పనులు చేపడతారు అన్న అంశాన్ని పరిశీలించడానికి జపాన్ బృందం విచ్చేసింది. డ్యాం, కాలువల వద్ద చేపట్టాల్సిన పనులను పూర్తిగా తెలుసుకుని తుది నివేదికలు పంపనున్నట్లు జపాన్ బృందం సభ్యులు తెలిపారు. డ్యాం స్థితిగతుల గురించి, కాలువల గురించి పరిటాల శ్రీరామ్ దగ్గరుండి జపాన్ బృందానికి తెలియజేశారు. ఇరిగేషన్ అధికారులు కూడా డ్యాం నిర్మాణం తదితర అంశాల గురించి తెలిపారు. పేరూరు డ్యాంకు నీరు తీసుకురావడానికి తాము కృషి చేస్తున్నామని, ఇప్పటికే ప్రభుత్వం డ్యాంకు నీరు తీసుకురావడానికి సర్వేకు రూ.1.10 కోట్లు మంజూరు చేసిందని, సర్వే కూడా జరుగుతున్నట్లు తెలిపారు. పేరూరు డ్యాంకు నీరు తీసుకురావడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని శ్రీరామ్ తెలిపారు. ఈ పనులు పరిశీలించిన జపాన్ బృందం తుది నివేదిక పంపగానే నిధులు మంజూరవుతాయని, ఆ వెంటనే పనులు చేపట్టడం జరుగుతుందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. వీరి వెంట టిడిపి నాయకులు ఎల్.నారాయణచౌదరి, పరిటాల మహేంద్ర, రామ్మూర్తినాయుడు, బడగొర్ల ఆంజనేయులు, పరంధామయాదవ్, వెంకటేష్, ఇరిగేషన్ ఎస్‌ఈ సుబ్బారావు, ఈఈ కృష్ణమోహన్, డిఈ మహేశ్వరరెడ్డి, ఏఈ రవికుమార్, సాగునీటి సంఘం ప్రెసిడెంట్ ప్రభాకర్, పేరూరు ఆయకట్టు సంఘం ప్రెసిడెంట్ భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
చిలమత్తూరు, మార్చి 15 : మండల పరిధిలోని కోడూరు తోపు సమీపంలోని జాతీయ రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంత్ (65) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు హైదరాబాదుకు చెందిన అనంత్ కుటుంబ సభ్యులతో బెంగళూరుకు కారులో వెళ్తుండగా కోడూరు తోపు సమీపంలో రహదారిపై కారు బోల్తా పడింది. దీంతో అనంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. అందులో ప్రయాణిస్తున్న షర్మిళ తీవ్రగాయాలకు గురికాగా 108 వాహనంలో చికిత్స నిమిత్తం హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధాకర్ యాదవ్ తెలిపారు.