రాష్ట్రీయం

ఎంపీ జీవీఎల్ కృషితో 20 బస్సుల్లో వారణాసి నుంచి వస్తున్న తెలుగువారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 13: కరోనా ప్రభావంతో గత 20రోజులుగా వారణాసి పుణ్యక్షేత్రంలో చిక్కుకుపోయిన వెయ్యి మంది తెలుగు యాత్రికులు ఎట్టకేలకు దాదాపు 20 బస్సుల్లో సోమవారం బయలుదేరి వస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12 బస్సులు, సోమవారం ఉదయం మరో 8 బస్సులలో వారు స్వరాష్ట్రాలకు బయలుదేరినట్లు సమాచారం. ప్రధాన మంత్రి కార్యాలయం అనుమతితో బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ప్రత్యేక కృషి చేసి యూపీ ప్రభుత్వ సమన్వయంతో ప్రత్యేక అనుమతులు పొందారు. ఈమేరకు అక్కడి నుంచి తెలుగువారిని పంపించడం సాధ్యమైందని తెలిసింది.