జాతీయ వార్తలు

రెండు వారాల్లో సమాధానమివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాఠశాలల్లో సదుపాయాలపై తెలుగు రాష్ట్రాలకు సుప్రీం ఆదేశం
విచారణ ఏప్రిల్ 11కు వాయిదా
న్యూఢిల్లీ, మార్చి 14: ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలలో పాఠశాలల్లో వౌలిక సదుపాయాల కల్పన, స్థితిగతులపై దాఖలైన పిటిషన్ విచారణ ఏప్రిల్ 11కు వాయిదా పడింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ, ఉపాధ్యాయుల జవాబుదారీతనంపై దాఖలైన పిటిషన్‌కు రెండు వారాలలో సమాధానమివ్వాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, శివకీర్తి సింగ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఎపి తరపున న్యాయవాది గుంటూరు ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల (ఎస్‌జిటిల) నియామకాల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసిందని, ఈ నెలాఖరుకల్లా 8060 మంది ఉపాధ్యాయుల నియామకాలు పూర్తి అవుతాయని తెలిపారు. ఈ వివరాలను అఫిడవిట్ రూపంలో కోర్టుకు సమర్పించామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు దాఖలు చేయలేదని జస్టిస్ దీపక్ మిశ్రా ప్రశ్నించగా, అఫిడవిట్ సిద్ధంగా ఉందని ఈరోజే దాఖలు చేస్తామని తెలంగాణ తరపు న్యాయవాది విశ్వనాథశెట్టి చెప్పారు. నియామకాలను చేపడుతున్నామని ఇందులో భాగంగానే మే 1వ తేదీన రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను నిర్వహిస్తున్నామని తెలంగాణ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.